Tollywood: కైకాల, చలపతిరావు, వల్లభనేని జనార్ధన్‌కు సినీ ప్రముఖుల నివాళి

ABN , First Publish Date - 2022-12-29T21:47:43+05:30 IST

తెలుగు సినీపరిశ్రమలో వరుస విషాదాలు అలుముకుంటున్నాయి, సినీప్రముఖులు ఒకరి తర్వాత ఒకరు కాలం చేయడం తెలుగు సినీ పరిశ్రమకు తీరని..

Tollywood: కైకాల, చలపతిరావు, వల్లభనేని జనార్ధన్‌కు సినీ ప్రముఖుల నివాళి

తెలుగు సినీపరిశ్రమలో వరుస విషాదాలు అలుముకుంటున్నాయి, సినీప్రముఖులు ఒకరి తర్వాత ఒకరు కాలం చేయడం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఈ తరుణంలో రీసెంట్‌గా మృతి చెందిన కైకాల సత్యనారాయణ, చలపతిరావు, వల్లభనేని జనార్ధన్‌కు తెలుగు సినీపరిశ్రమ గురువారం సంతాపసభను నిర్వహించింది. ఈ సంతాప సభకు పరుచూరి గోపాలకృష్ణ అధ్యక్షత వహించారు.

Ravibabu.jpg

ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసి రెడ్డి, సెక్రెటరీ దామోదర ప్రసాద్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కళ్యాణ్, సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్, డైరెక్టర్ బి.గోపాల్, నిర్మాత డి వి కే రాజు, ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ సెక్రెటరీ కాజా సూర్యనారాయణ, చలపతి రావు కుమారుడు రవి బాబు, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్, నిర్మాత ఆచంట గోపీనాథ్, రైటర్ సాయినాథ్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సెక్రెటరీ మాదాల రవి, రామ సత్యనారాయణ, దర్శకుల సంఘం నుంచి కాశీ విశ్వనాథ్, నిర్మాత సుబ్బారెడ్డి, వైవిఎస్ చౌదరి వంటి సినీ ప్రముఖులు, సాంకేతిక నిపుణులెందరో ఈ కార్యక్రమానికి హాజరై కైకాల, చలపతిరావు, వల్లభనేని జనార్ధన్‌కు నివాళులర్పించారు.

Updated Date - 2022-12-29T21:47:44+05:30 IST