సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Tollywood Box-Office: గత వారం సినిమాలు ఎలా వున్నాయి అంటే...

ABN, First Publish Date - 2022-12-12T14:48:04+05:30

గత వారం చాలా సినిమాలు విడుదల అయ్యాయి. అందులో అగ్ర నటీమణుల్లో ఒకరు అయిన తమన్నా (Tamannah Bhatia) సినిమా 'గుర్తుందా శీతాకాలం' (Gurthunda Seethakalam) కూడా వుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సత్యదేవ్ (Satyadev) ఇందులో తమన్నా పక్కన కథానాయకుడు గా నటించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గత వారం చాలా సినిమాలు విడుదల అయ్యాయి. అందులో అగ్ర నటీమణుల్లో ఒకరు అయిన తమన్నా (Tamannah Bhatia) సినిమా 'గుర్తుందా శీతాకాలం' (Gurthunda Seethakalam) కూడా వుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సత్యదేవ్ (Satyadev) ఇందులో తమన్నా పక్కన కథానాయకుడు గా నటించాడు. ఇది కాకుండా 'ముఖ చిత్రం', (Mukhachitram) 'పంచ తంత్రం', (Panchatantram) 'లెహరాయి' (Leharayi) లాంటి చిన్న సినిమాలు కూడా విడుదల అయ్యాయి. కానీ వీటి ప్రభావం ఏవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించలేకపోయాయి. అన్నీ టోటల్ ఫెయిల్యూర్ గా నిలిచాయి. తమన్నా అంత పెద్ద నటి వున్న సినిమా కూడా ఓపెనింగ్స్ రాబట్టలేక పోయింది అంటే, ప్రేక్షకులు సినిమాలో అద్భుత కంటెంట్ ఉంటే గానీ థియేటర్ కి రావటం లేదు అని అర్థం అవుతోంది.

'పంచతంత్రం' సినిమాలో తెలుగు నటీనటులు చాలామంది వున్నారు, ఆ సినిమాలో నటించిన నటీనటులు అందరూ సాంఘీక మాధ్యమాల్లో బాగా ఫాలోయింగ్ వున్నవాళ్లు అవటం వల్ల అక్కడ విపరీతమయిన ప్రచారం చేసినప్పటికీ, ఆ సినిమా ఒక పెద్ద డిసాస్టర్ గా నిలిచింది. ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం (Top comedian actor Brahmanandam) ఈ సినిమాలో ఒక నెరేటర్ గా కనిపించారు. అలాగే కలర్స్ స్వాతి (Colours Swathi) చాల కాలం విరామం తరువాత ఈ సినిమాలో నటించటం జరిగింది, ఎంతమంది వున్నా, ఎంత చేసినా, సినిమాలో విషయం లేకపోతే, ప్రేక్షకులు రారు అని రుజువయింది.

ఇంక 'కలర్ ఫోటో' అనే సినిమాతో జాతీయ అవార్డు తెచ్చుకున్న సందీప్ రాజ్ (National Award winner Sandeep Raj) ఈ 'ముఖచిత్రం' అనే సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. ఇందులో ప్రముఖ నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ అలాగే ఒక చిన్న సందేశం కూడా అవండి. ప్రియ వడ్లమాని ఇందులో చాల బాగా చేసింది అని అందరూ ప్రశంసించారు కూడా. కానీ ఈ సినిమాకి కూడా చూడటానికి ప్రేక్షకులు థియేటర్ కి రాలేదు. ఇది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలించింది. గంగాధర్ దీనికి దర్శకుడు.

గత వారం విడుదల అయిన సినిమాల్లో ఈ మూడు కొంచెం చెప్పుకోదగ్గ సినిమాలు అని చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉంటే, అడివి శేష్ నటించిన (Adivi Sesh) 'హిట్ 2' (HIt 2) సినిమా రెండో వారం కూడా తన హవాని కొంచెం కొనసాగిస్తోంది అని చెప్పవచ్చు. శైలేష్ కొలను దీనికి దర్శకుడు. ఈ సినిమా నటీనటులు, దర్శకుడు ఈ సినిమా ప్రచారాన్ని ఆపకుండా కంటిన్యూ చేస్తూనే వున్నారు. ఆ సినిమా కలెక్షన్స్ లో ఇప్పుడు విడుదల అయిన కొత్త సినిమాల కన్నా బాగానే ఉన్నాయని చెప్పొచ్చు.

అలాగే కొన్ని వారల క్రితం విడుదల అయినా 'లవ్ టుడే' (Love Today) అనే డబ్బింగ్ సినిమా కూడా కలెక్షన్స్ పరంగా ఇప్పుడు విడుదల అయినా సినిమాల కన్నా, చాల బాగుంది అనే చెప్పాలి. ఇప్పుడు ఆ సినిమా మూడో వారం లోకి వచ్చింది, అయినా కలెక్షన్స్ పరవాలేదు అనిపించేలా ఇంకా బాగున్నాయి. ఇది తమిళం లో చాల పెద్ద విజయం సాధించింది. అక్కడ సుమారు 50 కోట్ల పైనే బిజినెస్ చేసిన 'లవ్ టుడే' తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. అయితే ఈ సినిమా నిర్మాతలు ఎవరికీ హక్కులు అమ్మకుండా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ద్వారా విడుదల చేశారు. తెలుగులో కూడా బాగానే ఆడింది ఈ సినిమా.

Updated Date - 2022-12-12T15:57:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!