Sukumar: అందుకే అనుపమని ‘రంగస్థలం’కి తీసుకోలేదు

ABN , First Publish Date - 2022-12-20T21:11:06+05:30 IST

‘రంగస్థలం’ (Rangasthalam)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని తాజాగా జరిగిన ‘18 పేజెస్’ (18 Pages) మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు సుకుమార్

Sukumar: అందుకే అనుపమని ‘రంగస్థలం’కి తీసుకోలేదు
Director Sukumar

‘రంగస్థలం’ (Rangasthalam)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని తాజాగా జరిగిన ‘18 పేజెస్’ (18 Pages) మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు సుకుమార్ షేర్ చేసుకున్నారు. జీఏ 2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘18 పేజెస్’. నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddharth), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా నటిస్తున్న ఈ సినిమాని బన్నీ వాసు (Bunny Vas) నిర్మిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పిస్తున్నారు. సుకుమార్ (Sukumar) కథ అందించిన ఈ చిత్రం క్రిస్మస్ (Christmas) స్పెషల్‌గా డిసెంబర్ 23న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సుకుమార్ మాట్లాడుతూ..

‘‘అల్లు అరవింద్‌ (Allu Aravind)గారు తండ్రి సమానులు. గీతా ఆర్ట్స్‌లో అడుగుపెట్టి.. ఆయన ఎదురుగా కూర్చోవడమే గొప్ప విషయం అనుకున్నప్పుడు, ఇలా నా ప్రొడక్షన్ నేమ్‌ని.. ఆయనతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీ‌గా ఉంది. నేను ప్రొడ్యూసర్ అవుదామని ‘జగడం’ (Jagadam) అప్పుడే అనుకున్నా. నేను ‘హ్యాపీడేస్’ (Happy Days) సినిమా అప్పుడు నిఖిల్‌ను పిలిచి లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను. నాకు అప్పుడే అతను సక్సెస్ అవుతాడని అర్ధమైంది. నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటనలో బన్నీవాసు తోడుగా ఉన్నాడు. తమ్ముడు ప్రతాప్.. నేను చేసిన ప్రతి కథలోనూ భాగమే. నేను ఒక చిన్న లైన్ చెబితే మొత్తం వాడే రాసుకుని నాకు క్రెడిట్ ఇస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయ్యింది అంటే దానికి కారణం ప్రతాప్. పాటల రచయిత శ్రీమణి‌ (Sri Mani)ని నేను పరిచయం చేసినందుకు గర్వంగా ఫీల్ అవుతుంటాను. మరో పాటల రచయిత తిరుపతి ఈ చిత్రంతో పరిచయం అవుతున్నాడు. అతను కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అనుపమ (Anupama) గురించి చెప్పాలంటే.. ‘రంగస్థలం’ సినిమాకు ఫస్ట్ తనే హీరోయిన్. కానీ డిస్కషన్స్ టైమ్‌లో అస్తమానం ఆమె వాళ్ల అమ్మ వైపు చూస్తూ ఉండేది. షూటింగ్‌లో కూడా అలాగే చూస్తే.. కష్టం అని భావించడంతో.. ఫైనల్‌గా ఆమె ఆ సినిమా చేయలేకపోయింది. తను మంచి ఫెర్మార్మర్. అలాగే బ్యూటీఫుల్ హీరోయిన్. అన్నిటికంటే కూడా తెలుగు బాగా మాట్లాడుతుంది. ఖచ్చితంగా తనతో భవిష్యత్‌లో సినిమా చేస్తాను. నా రైటింగ్‌లో వచ్చిన ప్రతి సినిమాకి బన్ని వచ్చినందుకు థాంక్యూ. ‘పుష్ప’ (Pushpa) కథ కూడా బన్నీ వినలేదు.. సినిమా చేద్దాం అంటే చేద్దాం అన్నాడు.. అంతే.. థాంక్యూ డార్లింగ్. ఈ సినిమా రషెష్ నచ్చి రత్నవేలు వచ్చి కొన్ని షాట్స్ చేశారు. థాంక్యూ రత్నవేలు...’’ అని సుకుమార్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-12-20T21:11:07+05:30 IST