Lucky Lakshman: నవ్విస్తాడు.. ఏడిపిస్తాడు

ABN , First Publish Date - 2022-12-28T18:26:18+05:30 IST

బిగ్‌బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌ (Bigg Boss Telugu fame Sohel), మోక్ష (Mokksha) హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’ (Lucky Lakshman). ద‌త్తాత్రేయ మీడియా..

Lucky Lakshman: నవ్విస్తాడు.. ఏడిపిస్తాడు
Lucky Lakshman Movie Team

బిగ్‌బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌ (Bigg Boss Telugu fame Sohel), మోక్ష (Mokksha) హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’ (Lucky Lakshman). ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌. అభి (AR Abhi) దర్శ‌క‌త్వంలో హ‌రిత గోగినేని (Haritha Gogineni) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 30న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా ‘ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌’ ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు. ఈవెంట్‌లో బిగ్ టికెట్‌ను డైరెక్టర్ అభి తండ్రి గంగిరెడ్డి ఆవిష్కరించి సోహైల్ తండ్రి సలీమ్‌కి అందించారు. ఈ ఈవెంట్‌లో ‘ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్’ టీమ్ ఓ కొత్త ఒర‌వ‌డికి శ్రీకారం చుట్టారు. ‘కొర‌మీను’ (Korameenu) టీమ్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానించారు. డిసెంబ‌ర్ 31న కొర‌మీను సినిమా రిలీజ్ కాబోతోంది. ఒక‌రికొక‌రు స‌పోర్ట్ అందించుకుంటూ ముందుకు సాగే స‌రికొత్త ట్రెండ్‌కి ఈ రెండు సినిమా యూనిట్స్ ఆహ్వానం ప‌లికాయి.

ఈ కార్యక్రమంలో హీరో సోహెల్ మాట్లాడుతూ.. ‘‘నేను ఈ స్థాయికి రావడానికి కారణం తెలుగు ప్రజలు. ప్రతీ సక్సెస్‌మెన్ వెనుక ఉమెన్ ఉంటుందని అంటారు. కానీ నా సక్సెస్ వెనుక మా నాన్న ఉన్నాడు. నాకు వచ్చిన డబ్బుల్లో కొంత సాయం చేయడమే నాకు తెలుసు. నాకు సినిమా తప్పా ఇంకోటి తెలీదు. మా నిర్మాత హరిత గారు ఈ సినిమాను ఓన్‌గా రిలీజ్ చేస్తున్నారు. డైరెక్టర్ అభి ఎంతో కష్టపడ్డారు. సినిమా కంటెంట్‌ను నమ్మి చేస్తున్నామని డైరెక్టర్ ఎప్పుడూ చెబుతూనే వచ్చారు. ఇది ఫ్యామిలీ సబ్జెక్ట్. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నవ్వుతారు, ఏడుస్తారు. డిసెంబర్ 30న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’’ అని అన్నారు. డైరెక్టర్ అభి మాట్లాడుతూ.. ‘‘మనలో ప్యాషన్ ఉంటే ఏదైనా చేయగలం. కాస్త ఆలస్యం అవుతుందేమో గానీ రావడం మాత్రం పక్కా. తప్పు చేస్తే చెప్పి చెయ్ అని మా నాన్న గారు చెబుతుంటారు. ఆయన కొడుకుగా పుట్టడం నా అదృష్టం. సినిమా గురించి ఇప్పుడు నేనేం మాట్లాడను. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ చూశారు. థియేటర్ నుంచి బయటకు వచ్చాక మంచి సినిమా చూశామని ఫీల్ అవుతారు. ఈ సినిమా చేద్దామని అనుకున్న తరువాత సోహెల్‌ను కలిశాం. ఫస్ట్ సిట్టింగ్‌లోనే కథ ఓకే చేశాడు. సోహైల్‌ ఫైనాన్షియల్ స్టేటస్, సోషల్ స్టేటస్ నాకు తెలుసు. కానీ ఎంత మందికి సాయం చేస్తారో మీకు తెలీదు. అవుట్ సైడ్ కాదు ఇన్ సైడ్ కూడా బ్యూటీఫుల్. నేను ఏం చేయలేను.. దేనికి పనికి రాను అనే సమయంలో హరిత నన్ను నమ్మింది. నాది లక్ కాదు.. అంతకు మించి. ప్రతీ క్రాఫ్ట్‌లో హరిత ఇన్వాల్వ్ అయింది. ఆమె ఓ మంచి నిర్మాత. సినిమా కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడ్డారు’’ అని అన్నారు. (Lucky Lakshman Pre Release Event)

నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ.. ‘‘నేను ఏ పని చేసినా దైవంగానే భావిస్తాను. పనే దైవంగా భావిస్తుంటా. ఏం చేసినా కూడా అదే నమ్ముతాను. అభికి చిన్నతనం నుంచి డైరెక్షన్ పిచ్చి ఉంది. ఎప్పుడైనా ఆపేస్తాడేమో అనుకున్నాను. డైరెక్షన్ చేయాలనే కోరిక ఉందని నాకు అర్థమైంది. చిన్నతనంలో నా కోరికలేవీ తీరలేదేమో గానీ.. అభి తన జీవితంలో ఉన్న ఒకే ఒక్క కోరికను తీర్చాలని అనుకున్నాను. అందుకే మా ప్రతీ చెమట చుక్కని డబ్బుగా మార్చి ఈ సినిమాను తీశాం. బడ్జెట్ పరంగా చిన్న సినిమానే అయినా ఇది మాకు చాలా పెద్ద సినిమా. కంటెంట్ ఉన్న మూవీస్‌ను తెలుగు ఆడియెన్స్‌ ఆదరిస్తారనే నమ్మకంతోనే ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం. ఇదంతా కూడా మా టీం వల్లే సాధ్యమైంది. ఈ సినిమాలో డైరెక్టర్‌ గారి రైటింగ్ అద్భుతంగా ఉంది. సోహైల్‌ చాలా మంచి అబ్బాయి. ఎంతో కష్టపడతాడు. కాస్త షార్ట్ టెంపర్ కూడా ఉంటుంది. లోపల ఎలా ఉంటే బయట అలా ఉంటాడు. మనిషి కదా? అన్ని ఎమోషన్స్ ఉండాలి. సోహెల్ మంచి నటుడు. సోహెల్ పక్కా హీరో పీస్. మేం చేసిన పనిని గుర్తించండి’’ అని అన్నారు. ఇంకా కార్యక్రమానికి హాజరైన వారంతా ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరారు.

Updated Date - 2022-12-28T18:26:19+05:30 IST