సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Chalapathy Rao: సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత

ABN, First Publish Date - 2022-12-25T08:26:01+05:30

టాలీవుడ్‎(Tollywood)లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు(Senior Actor Chalapathy Rao) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చలపతిరావు(78) ఆదివారం తెల్లవారుజామున..

Senior Actor Chalapathi Rao
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్‎(Tollywood)లో మరో విషాదం చోటు చేసుకుంది. కైకాల సత్యనారాయణ మరణ వార్త మరువక ముందే.. ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు(Senior Actor Chalapathy Rao) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చలపతిరావు(78) ఆదివారం తెల్లవారుజామున బంజారాహిల్స్‌లోని(Banjara Hills) స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. 1944 మే 8న కృష్ణా జిల్లా(Krishna District) బల్లిపర్రులో చలపతిరావు జన్మించారు. చలపతిరావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నటుడు, దర్శకుడు రవిబాబు ఆయన తనయుడే. చలపతిరావు దాదాపు 1,200 పైగా సినిమాలలో నటించారు. నటుడు, నిర్మాతగా చలపతిరావు గుర్తింపు పొందారు. నిర్మాతగా 7 సినిమాలను చలపతిరావు నిర్మించారు. బుధవారం రోజున మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆయన కుమార్తె అమెరికా నుంచి వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నామని.. ఆదివారం మధ్యాహ్నం వరకు ఆయన భౌతిక కాయాన్ని.. కుమారుడు రవిబాబు ఇంట్లోనే అభిమానుల సందర్శనార్థం ఉంచి.. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆయన పార్థివ దేహాన్ని ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానం ఫ్రీజర్‌లో ఉంచనున్నారని తెలిసింది. చలపతిరావు మరణవార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. (#RIPChalapathiRao)

Updated Date - 2022-12-25T08:26:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!