Vijayendra Prasad: ఫ్రాంచైజీగా రాజమౌళి, మహేశ్ బాబు సినిమా

ABN , First Publish Date - 2022-12-31T15:21:20+05:30 IST

రియల్ ఘటనలను స్ఫూర్తిగా తీసుకుని ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ కు స్క్రిఫ్ట్ వర్క్‌ను పూర్తి చేస్తున్నానని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఫ్రాంచైజీగా రూపొందిస్తామని చెప్పారు. సీక్వెల్స్ ఉంటాయన్నారు. సీక్వెల్స్‌లో కథ మారినప్పటికీ ముఖ్యమైన పాత్రలు ఆ విధంగానే ఉంటాయని తెలిపారు.

Vijayendra Prasad: ఫ్రాంచైజీగా రాజమౌళి, మహేశ్ బాబు సినిమా

ఇండియాలోని ఫేమస్ రైటర్స్‌లో విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) ఒకరు. ‘బజరంగీ భాయిజాన్’, ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలకు కథలను అందించి ఫేమ్‌ను సంపాదించుకున్నారు. దర్శక ధీరుడు ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన అన్ని సినిమాలకు రైటర్‌గా వ్యవహరించారు. మహేశ్ బాబు (Mahesh Babu) తో జక్కన్న చేయబోయే తర్వాతి ప్రాజెక్టుకు కూడా కథను అందిస్తున్నారు. ఈ మూవీకి వర్కింగ్ టైటిల్‌గా ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ29’ (SSMB29) అని వ్యవహరిస్తున్నారు. మహేశ్ బాబు సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్‌ను తాజాగా విజయేంద్రప్రసాద్ ప్రేక్షకులతో పంచుకున్నారు.

రియల్ ఘటనలను స్ఫూర్తిగా తీసుకుని ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ కు స్క్రిఫ్ట్ వర్క్‌ను పూర్తి చేస్తున్నామని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఫ్రాంచైజీగా రూపొందిస్తామన్నారు. సీక్వెల్స్ ఉంటాయన్నారు. సీక్వెల్స్‌లో కథ మారినప్పటికీ ముఖ్యమైన పాత్రలు ఆ విధంగానే ఉంటాయని తెలిపారు. మొదటి భాగానికి సంబంధించిన స్క్రిఫ్ట్ వర్క్ చివరకు వచ్చిందన్నారు. జంగిల్ అడ్వెంచర్‌గా మూవీ రూపొందనుంది. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసకుడి నేపథ్యంలో తెరకెక్కనుంది. వచ్చే ఏడాది మే, జూన్‌లో ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ గురించి విజయేంద్ర ప్రసాద్ గతంలో మాట్లాడారు. ‘‘మహేశ్ బాబు అద్భుతమైన నటుడు. యాక్షన్ సన్నివేశాల్లో సులభంగా భావోద్వేగాలను పలికిస్తాడు. అందువల్ల రైటర్‌కు ఎక్కువ పని ఉండదు. అతడి పాత్ర నుంచి హావభావాలు పలికించడానికి తక్కువ సమయం చాలు. చాలా కాలంగా రాజమౌళి ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో సినిమా చేయాలనుకుంటున్నారు. కానీ, ఎప్పుడు అవకాశం రాలేదు. ప్రస్తుతం మహేశ్ బాబుతో అటువంటి చిత్రం చేసే ఛాన్స్ వచ్చింది’’ అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ పట్టాలెక్కనుంది.

Updated Date - 2022-12-31T15:27:48+05:30 IST