సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Samantha Ruth Prabhu: ఖుషీ సినిమా షూటింగ్ ఎప్పుడంటే...

ABN, First Publish Date - 2022-12-29T14:25:16+05:30

అభిమానులే కాకుండా, 'ఖుషీ' (Khushi) సినిమా యూనిట్ సభ్యులు కూడా సమంత షూటింగ్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఎప్పుడు నుండి షూటింగ్ మొదలు పెడతారు అన్న విషయం మీద ఒక క్లారిటీ వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ఎప్పుడు మళ్ళీ షూటింగ్ చేస్తుందా అని ఆమె అభిమానులు అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అభిమానులే కాకుండా, 'ఖుషీ' (Khushi) సినిమా యూనిట్ సభ్యులు కూడా సమంత షూటింగ్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఎప్పుడు నుండి షూటింగ్ మొదలు పెడతారు అన్న విషయం మీద ఒక క్లారిటీ వచ్చింది. ఆమె చేస్తున్న 'ఖుషీ' సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంత జనవరి 26 (Samantha to participate in Khushi shooting from January 26, says a close source of her) నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతారని తెలిసింది. శివ నిర్వాణ ఈ సినిమా కి దర్శకుడు. సంక్రాంతి పండగ అయిపోయాక ఏకధాటిగా షూటింగ్ చేసుకోవచ్చు అని అందుకని జనవరి 26 నుండి షూటింగ్ కి సమంత హాజరు అవుతారని, సమంత తో సన్నిహితంగా వుండేవాళ్ళు చెప్పారు.

సమంత ఆరోగ్యం కూడా ఇప్పుడు చాలా మెరుగు అయిందని, ఆమె చాలా ఉత్సాహంగా కూడా ఉందని తెలిసింది. 'ఖుషీ' షూటింగ్ కన్నా ముందే 'శాకుంతలం' (Sakunthalam) సినిమా ప్రమోషన్స్ కి సమంత హాజరు కావచ్చు అని కూడా అంటున్నారు. దర్శకుడు గుణశేఖర్ 'శాకుంతలం' (Director Gunasekhar) సినిమా విడుదల ఎప్పుడు అనే విషయం త్వరలో అనౌన్స్ చేస్తారని, ఆ సినిమా గురించి ఇంతవరకు బయట ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కూడా పెట్టలేదు, ఇప్పుడు జనవరి నుండి మొదలు పెట్టాలని అనుకుంటున్నారు, అందువల్ల, ఆ ప్రొమోషన్ ఈవెంట్ కి సమంత హాజరు కావొచ్చు అని తెలిసింది. ఏమైనా కూడా సమంత ఆరోగ్యంగా మళ్ళీ సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్, అభిమానులతో ఆనందంగా గడపాలని ఆశిద్దాం.

Updated Date - 2022-12-29T14:25:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!