Samantha: ‘కొత్త సంవత్సరానికి ఈ తీర్మానం చేసుకోండి’

ABN , First Publish Date - 2022-12-30T11:39:11+05:30 IST

మరో రెండు రోజుల్లో 2022 ముగిసి.. కొత్త సంవత్సరం రానుంది. కొత్త సంవత్సరం (New Year) అంటే ఏదో ఒక తీర్మానం చేసుకోవడం చాలామందికి అలవాటు. అవి వారి మంచి భవిష్యత్తుకి ఉపయోగపడతాయని అనుకుంటారు.

Samantha: ‘కొత్త సంవత్సరానికి ఈ తీర్మానం చేసుకోండి’
Samantha

మరో రెండు రోజుల్లో 2022 ముగిసి.. కొత్త సంవత్సరం రానుంది. కొత్త సంవత్సరం (New Year) అంటే ఏదో ఒక తీర్మానం చేసుకోవడం చాలామందికి అలవాటు. అవి వారి మంచి భవిష్యత్తుకి ఉపయోగపడతాయని అనుకుంటారు. 2023 కోసం కూడా ఓ తీర్మానం చేసుకోమని తన అభిమానులకి సలహా ఇచ్చింది. సోషల్ మీడియాలో మేకప్ లేకుండా ఓ పిక్‌ని సమంత (Samantha) షేర్ చేసింది.

ఆ పోస్ట్‌లో.. ‘ఫంక్షన్ ఫార్వర్డ్… మనం చేయగలిగిన దాన్ని నియంత్రించండి!! కొత్త, సులభమైన తీర్మానాల కోసం ఇది సమయం అని అర్థం చేసుకోండి. దేవుడు అనుగ్రహిస్తాడు. 2023 శుభాకాంక్షలు!!’ అని సమంత రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఎంతోమంది నెటిజన్లు స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

samantha1.jpg

‘మీ పోస్ట్ కోసం ఎదురుచూస్తున్నాను!! నువ్వు చాలా బలవంతురాలివి, సూపర్ ఉమెన్. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని ఒకరు.. ‘జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చిన స్ట్రాంగ్‌గా ఉండాలని నిన్ను చూసి నేర్చుకున్నా. థ్యాంక్యూ సామ్’ అని మరొకరు.. ‘దృఢంగా ఉండు సామ్. త్వరలో అన్ని సర్దుకుంటాయి’ అని ఇంకొకరు రాసుకొచ్చారు. కాగా.. సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటోంది.

sam.jpg

Updated Date - 2022-12-30T11:39:13+05:30 IST