RRR: టాప్ 15లో ‘నాటు నాటు’.. ఆస్కార్‌కి రెండు అడుగుల దూరంలో..
ABN, First Publish Date - 2022-12-22T11:55:33+05:30
ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సృష్టించిన రికార్డుల గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్ల వసూళ్లు సాధించింది.
ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సృష్టించిన రికార్డుల గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్ల వసూళ్లు సాధించింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలు సైతం పొందింది. అలాగే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పలు అవార్డులు కూడా గెలుచుకుంది. తాజాగా మరో అవార్డుకి రెండడగుల దూరంలో నిలిచింది.
ప్రపంచంలోని సినీ పురస్కారాల్లో ఆస్కార్స్ (Oscars)కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమంలో పలు విభాగాల కోసం ఈ చిత్రం పోటీకి నిలిచింది. తాజాగా ఆస్కార్స్‌లోని ‘బెస్ట్ ఓరిజినల్ సాంగ్’ (Best Original Song) విభాగంలో పోటీ పడేందుకు ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ సాంగ్ షార్ట్ లిస్ట్ అయ్యింది. ఈ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 81 పాటలు పోటీపడగా.. అందులో నుంచి టాప్ 15 పాటలను ఈ అవార్డుల కమిటీ విడుదల చేసింది. అందులో ‘నాటు నాటు’ పాటకి కూడా చోటు దక్కడం విశేషం. ఈ 15 పాటల నుంచి కేవలం 5 పాటలు మాత్రం ఆస్కార్స్ అఫిషీయల్ నామినేషన్స్‌కి అర్హత సాధిస్తాయి. అంటే ఈ పాట ఆస్కార్ అవార్డుకి రెండడుగుల దూరం నిలిచిందన్నమాట.
కాగా.. ఇండియా నుంచి ఆస్కార్ అవార్స్ నామినేషన్స్‌కి షార్ట్ లిస్ట్ అయిన మొదటి సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ విషయాన్ని తెలుపుతూ ఈ మూవీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ ట్విట్ చేసింది. అందులో సపోర్టు చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపింది.