RRR: వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐమ్యాక్స్‌లో స్క్రీనింగ్.. అదే వేదికపై సర్‌ప్రైజ్..

ABN , First Publish Date - 2022-12-31T18:38:31+05:30 IST

దర్శకధీరుడు ఎస్‌ఎస్.రాజమౌళి (SS. Rajamouli) తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

RRR: వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐమ్యాక్స్‌లో స్క్రీనింగ్.. అదే వేదికపై సర్‌ప్రైజ్..

దర్శకధీరుడు ఎస్‌ఎస్.రాజమౌళి (SS. Rajamouli) తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ.1200కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ మూవీకి వెస్ట్రన్ ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యారు. హాలీవుడ్‌కు చెందిన అనేక మంది ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లోను ‘ఆర్ఆర్ఆర్’ సత్తా చాటింది. రెండు గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్‌ను కూడా సాధించింది. ఆస్కార్ బరిలోను ఈ చిత్రం నిలిచింది.

అకాడమీ అవార్డ్స్‌కు సైతం ‘ఆర్ఆర్ఆర్’ షార్ట్‌లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ స్క్రీనింగ్‌ను జనవరి 9న ఏర్పాటు చేశారు. లాస్ ఏంజెలెస్‌లోని టీసీఎల్ చైనీస్ థియేటర్‌లో వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐమ్యాక్స్ స్క్రీన్‌లో చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. ఈ స్క్రీనింగ్‌కు సంబంధించి ఓ సర్‌ప్రైజ్ ఉంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఎస్ఎస్. రాజమౌళి, కీరవాణి ఒకే వేదికపై కలసి దర్శనమివ్వనున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ కు సంబంధించిన విషయాల పైన ముచ్చటించనున్నారు. ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానమివ్వనున్నారని తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ ను 1920ల బ్యాక్ డ్రాప్‌లో ఫిక్షనల్ స్టోరీగా రూపొందించారు. స్వాతంత్ర్య సమరయోధులైన అల్లూరి సీత రామ రాజు, కొమరం భీమ్‌లను స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, శ్రియ శరణ్, సముద్ర ఖని, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్, ఒలివియా మోరిస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే జపాన్‌లో విడుదలైంది. ఆ దేశంలోను రికార్డులు క్రియేట్ చేసింది. అత్యధిక వసూళ్లను సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డును నెలకొల్పింది.

Updated Date - 2022-12-31T18:41:22+05:30 IST