Rashmika Mandanna: దక్షిణాది పాటలపై రష్మిక విమర్శలు.. బ్యాన్ చేయాలంటూ..

ABN , First Publish Date - 2022-12-29T11:23:56+05:30 IST

దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna). ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ సినిమా కెరీర్ ప్రారంభించిన ఈ భామ అనంతరం ‘ఛలో’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది.

Rashmika Mandanna: దక్షిణాది పాటలపై రష్మిక విమర్శలు.. బ్యాన్ చేయాలంటూ..
Rashmika Mandanna

దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna). ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ సినిమా కెరీర్ ప్రారంభించిన ఈ భామ అనంతరం ‘ఛలో’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. అనంతరం సౌత్ భాషల్లో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే.. ఈ బ్యూటీ కెరీర్ ప్రారంభం నుంచి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంది. ఇటీవల కాలంలో అయితే వివాదాలకి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. కొన్నిరోజుల క్రితమే ‘కాంతార’ (Kantara) సినిమా విషయమై కన్నడ నాట విమర్శల పాలైన విషయం తెలిసిందే. దాన్ని నుంచి పూర్తిగా బయటపడకముందే ఈ బ్యూటీ తాజాగా మరో వివాదంలో ఇరుక్కుంది.

‘పుష్ప’ (Pushpa) సినిమాతో రష్మిక పాన్ ఇండియా స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ క్రేజ్‌లో అక్కడ వరుస సినిమాలు చేస్తోంది. అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఆమె నటించిన చిత్రం ‘గుడ్ బై’ ఇటీవలే విడుదలై మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. సిద్ధార్థ్ మల్హోత్రా‌తో కలిసి నటించిన తాజా చిత్రం ‘మిషన్ మజ్ను’ త్వరలో డైరెక్ట్ ఓటీటీలో విడుదలకి సిద్ధమవుతోంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్‌లో చిత్రబృందం బిజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఓ కార్యక్రమంలో సౌత్ సినిమా పాటలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Rashmika1.jpg

రష్మిక మాట్లాడుతూ.. ‘దక్షిణాది సినిమా పాటల కంటే బాలీవుడ్ (Bollywood) సినిమా పాటలు బావుంటాయి. నేను చిన్నప్పటి నుంచి బాలీవుడ్ సాంగ్స్ వింటూనే పెరిగాను. ఆ పాటలు రొమాంటిక్‌గా ఉంటాయి. కానీ సౌత్ సాంగ్స్‌లో ఎక్కువగా మాసాలా పాటలు, డ్యాన్స్ నంబర్లే ఉంటాయి’ అని దక్షిణాది పాటలను అవమానించేలా మాట్లాడింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో పలువురు దక్షిణాది సినీ ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా రష్మికపై విరుచుకుపడుతున్నారు.

Rashmika2.jpg

‘రష్మిక సౌత్‌లో మంచి రొమాంటిక్ సాంగ్స్ లేవని భావిస్తోంది. బాలీవుడ్‌లోనే మంచి సాంగ్స్ ఉంటాయని చెబుతోంది. ఈ వ్యాఖ్యలతో తన మూర్ఖత్వాన్ని ప్రపంచానికి చూపించింది’ అని ఒకరు.. ‘బాలీవుడ్ సాంగ్స్ ఎంత పర్వెర్టెట్‌గా ఉంటాయే మరిచిపోయినట్లు ఉంది’ అని మరొకరు.. ‘రష్మికని కన్నడ ఇండస్ట్రీ నుంచే కాదు.. సౌత్ ఇండస్ట్రీల నుంచే బ్యాన్ చేయాలి’ అని ఇంకొకరు రాసుకొచ్చారు.

Updated Date - 2022-12-29T11:23:59+05:30 IST