Avatar 2: భూమిని దేవుడు.. పండోరాను జేమ్స్ కామెరూన్..

ABN , First Publish Date - 2022-12-18T17:20:41+05:30 IST

జేమ్స్ కామెరూన్ (James Cameron) నుంచి వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్ 2’ (Avatar 2). 2009లో విడుదలైన ‘అవతార్‌’ కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way of Water) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Avatar 2: భూమిని దేవుడు.. పండోరాను జేమ్స్ కామెరూన్..

జేమ్స్ కామెరూన్ (James Cameron) నుంచి వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్ 2’ (Avatar 2). 2009లో విడుదలైన ‘అవతార్‌’ కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way of Water) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16న విడుదలైంది. సామాన్యులతో సహా సెలబ్రిటీలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అక్షయ్ కుమార్, ప్రకాష్ రాజ్, మంచు విష్ణు తదితరులు ఈ చిత్రాన్ని పొగిడారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మూవీపై పొగడ్తల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

‘‘అవతార్‌2 సినిమాని మరోసారి వీక్షించాను. అద్భుతమైన విజువల్స్‌తో, ఆకట్టుకునే అభినయలతో, ఊపిరి బిగబట్టే సన్నివేశాలతో సినిమా కొనసాగింది. దేవుడు భూమిని సృష్టిస్తే.. జేమ్స్ కామెరూన్ పండోరాను అనే ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు. ఈ ప్రపంచంలో నివసించాలని ఉంది. అవతార్‌2 చూసిన తర్వాత స్వర్గం.. పండోరా మాదిరిగా ఉంటుందని మాటిస్తే మనుషులందరు ఇప్పటికిప్పుడే చనిపోతారు’’ అని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో పోస్ట్‌ను షేర్ చేశాడు. దాదాపుగా 13ఏళ్ల తర్వాత సీక్వెల్ వస్తుండటంతో చిత్రంపై భారీ బజ్ ఉంది. బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతుంది. రిలీజ్ డే నాడు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 180మిలియన్ డాలర్స్‌ను రాబట్టింది. ఇండియాలో కూడా చిత్రం అద్భుతమైన కలెక్షన్స్‌ను సాధిస్తుంది. తొలిరోజు భారత్‌లో ఆరు మిలియన్ డాలర్స్ వసూళ్లను సాధించింది. టిక్కెట్ సేల్స్‌లో అమెరికా, చైనాలతో ఇండియా పోటీపడుతుంది.

Updated Date - 2022-12-18T17:22:10+05:30 IST