రకుల్‌ ఇంట విషాదం!

ABN , First Publish Date - 2022-12-29T13:31:28+05:30 IST

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preeth singh)ఇంట విషాదం నెలకొంది. ఊహించని సంఘటన జరిగిందంటూ రకుల్‌ సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగానికి (Emotional)లోనయ్యారు.

రకుల్‌ ఇంట విషాదం!

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preeth singh)ఇంట విషాదం నెలకొంది. ఊహించని సంఘటన జరిగిందంటూ రకుల్‌ సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగానికి (Emotional)లోనయ్యారు. 16 ఏళ్లగా రకుల్‌ పెంచుకుంటున్న పెంపుడు కుక్క బ్లోసమ్‌ (Pet dog bloosam(కన్నుమూయడంతో ఇంట్లో విషాదం నెలకొందని రకుల్‌ ఇన్‌స్టాలో పేర్కొంది. ఈ మేరకు రకుల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూసమ్‌తో దిగిన పలు ఫొటోలు షేర్‌ చేశారు.

‘బ్లోసమ్‌ 16 ఏళ్ల క్రితం నువ్వు మా జీవితాల్లోకి వచ్చావు. అప్పటి నుంటి మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం. మనిద్దరం కలిసే పెరిగాం. మంచి జీవితాన్ని అనుభవించావు. నువ్వు ఎలాంటి బాధ లేకుండా వెళ్లిపోయావు. నువ్వు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలి’ అని రకుల్‌ రాసుకొచ్చారు. దీనికి మంచు లక్ష్మీ సంతాపం తెలిపారు. బ్లోసమ్‌ మృతికి ఆమె సంతాపం తెలిపింది. ‘‘రెస్ట్‌ ఇన్‌ పీస్‌ బ్లోసమ్‌.. రకుల్‌ నాకు తెలిసినప్పటి నుంచి బ్లోసమ్‌ కూడా నాకు తెలుసు’’ అని లక్ష్మీ పేర్కొన్నారు.

Updated Date - 2022-12-29T13:33:13+05:30 IST

Read more