Chiranjeevi-Radhika: హిట్‌ కాంబినేషన్‌లో సినిమా!

ABN , First Publish Date - 2022-12-17T12:42:40+05:30 IST

చిరంజీవి - రాధికలది సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. వీరిద్దరి కలయికలో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలొచ్చాయి. చిరంజీవి పక్కన పోటీగా డాన్స్‌ చేయగల హీరోయిన్‌లతో రాధిక ఒకరు.

Chiranjeevi-Radhika: హిట్‌ కాంబినేషన్‌లో సినిమా!

చిరంజీవి (Chiranjeevi)- రాధికలది(Radhika) సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. వీరిద్దరి కలయికలో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలొచ్చాయి. చిరంజీవి పక్కన పోటీగా డాన్స్‌ చేయగల హీరోయిన్‌లతో రాధిక ఒకరు. (Radhika produce movie with Chiranjeevi) వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఈ విషయాన్ని ఇద్దరూ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అలాగే రాధిక భర్త శరత్‌కుమార్‌ కూడా చిరంజీవికి మంచి స్నేహితుడే! ఇప్పుడు చిరు-రాధికల కలయికలో ఓ చిత్రం రాబోతుందనే వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అయితే చిరంజీవి పక్కన రాధిక హీరోయిన్‌ కాదు. నిర్మాతగా ఆమె చిరుతో ఓ చిత్రం చేయడానికి సిద్ధమయ్యారని తెలిసింది. రెండేళ్ల క్రితం చిరంజీవి పుట్టినరోజున రాధిక - శరత్‌కుమార్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరుతో ఓ సిపిమా చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. రాధిక సొంత నిర్మాణ సంస్థ రాడాన్‌ పిక్చర్స్‌లో చిరు ఓ సినిమా చేయడానికి అంగీకరించారని సమాచారం. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. చిరుకి తగిన కథ కోసం ఆమె ప్రయత్నాలు చేస్తున్నారట. కొన్ని రోజులుగా రాధిక కొందరు రచయితలతో చర్చలు జరుపుతున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. చిరంజీవి కూడా ఓ లైన్‌ చెప్పా అనుకున్నారని, దానిపై రచయితలతో వర్క్‌ చేయిస్తున్నారని తెలిసింది. మరోవైపు దర్శకుడిని ఫైనల్‌ చేసే పనిలో ఉన్నారు రాధిక. కొత్త సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం చిరంజీవి వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా ఆయన నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం జనవరి 13న విడుదల కానుంది.

Updated Date - 2022-12-17T13:46:05+05:30 IST