S.S.Rajamouli: నేనీ స్థాయికి వస్తానని నమ్మింది నువ్వే!

ABN , First Publish Date - 2022-12-13T16:36:10+05:30 IST

న్యూయార్క్‌ ఫిలిం క్రిటిక్స్‌ సర్కిల్‌, లాస్‌ ఏంజెలీస్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అవార్డ్స్‌ పురస్కారాలు అందుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌.

S.S.Rajamouli: నేనీ స్థాయికి వస్తానని నమ్మింది నువ్వే!

న్యూయార్క్‌ ఫిలిం క్రిటిక్స్‌ సర్కిల్‌, లాస్‌ ఏంజెలీస్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అవార్డ్స్‌ పురస్కారాలు అందుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌. ఈ మేరకు దర్శకుడు రాజమౌళి, కీరవాణికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రాజమౌళి సినీ ప్రపంచాన్ని ఏలుతున్నారు. ఉత్తమ దర్శకుడిగా న్యూయార్క్‌ ఫిలిం క్రిటిక్స్‌ సర్కిల్‌ అవార్డ్‌తోపాటు లాస్‌ ఏంజెలీస్‌ ఫిలిం క్రిటిక్స్‌ బెస్ట్‌ డెరెక్టర్‌ రన్నరప్‌ పురస్కారాలు అందుకున్నందుకు శుభాకాంక్షలు. లాస్‌ ఏంజెల్స్‌ ఫిలిం క్రిటిక్స్‌ బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అవార్డ్‌ అందుకున్న కీరవాణి గారికి కంగ్రాట్స్‌ అంటూ ప్రభాస్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రభాస్‌ ట్వీట్‌కు రాజమౌళి స్పందించారు. ‘థాంక్స్‌ డార్లింగ్‌. నేను ఇంత పేరు తెచ్చుకుంటానని నాకంటే ముందు నమ్మిన వ్యక్తి నువ్వే’’ అని రిప్లై ఇచ్చారు రాజమౌళి. ప్రభాస్‌ ప్రస్తుతం ఆదిపురుష్‌, ప్రాజెక్ట్‌ కె, సలార్‌ చిత్రాలతో బిజీగా ఉన్నారు. రాజమౌళి మహేశ్‌తో సినిమా చేసే సన్నాహాల్లో ఉన్నారు.

Updated Date - 2022-12-13T16:38:08+05:30 IST