Pooja Hegde: ఆమె ఖాతాలో మరో ఫ్లాప్, కిం కర్తవ్యం

ABN , First Publish Date - 2022-12-31T12:20:59+05:30 IST

అటు దక్షిణాదిలోనూ, ఇటు హిందీ పరిశ్రమలోనూ పేరు తెచ్చుకుంటున్న పూజ హెగ్డే కి మరోసారి చుక్కెదురు అయింది.

Pooja Hegde: ఆమె ఖాతాలో మరో ఫ్లాప్, కిం కర్తవ్యం

పూజ హెగ్డే టాలీవుడ్ లో అగ్ర తారల్లో ఒకరుగా వెలుగొందుతోంది. అలాగే ఆమె హిందీ సినిమాల్లో కూడా కొన్ని సినిమాలతో బిజీ గా వుంది. అటు దక్షిణాదిలోనూ, ఇటు హిందీ పరిశ్రమలోనూ పేరు తెచ్చుకుంటున్న పూజ హెగ్డే కి మరోసారి చుక్కెదురు అయింది. తాజాగా విడుదల అయిన ఆమె హిందీ సినిమా 'సర్కస్' (Cirkus failed at the box-office) బాక్స్ ఆఫీస్ దగ్గర మడత పడింది. (Pooja Hegde's latest film 'Cirkus' is a big flop and put Pooja's career in a doldrums) కనీసం ఆ సినిమా ప్రచారానికి ఖర్చుపెట్టే డబ్బులు కూడా రాలేదు అని అంటున్నారు. పూజ హెగ్డే ఈ సినిమా మీద చాలా అసలు పెట్టుకుంది, కానీ పాపం ఆమె ఖాతాలో మరో ఫ్లాప్ పడింది. దీనితో ఆమెకి ఇది వరసగా ఆరో ఫ్లాప్. ఈ హిందీ సినిమాకి రోహిత్ శెట్టి (Director Rohit Shetty) దర్శకుడు కాగా, రణవీర్ సింగ్ (Ranveer Singh) లీడ్ యాక్టర్. అయినా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచెం కూడా ప్రభావం చూపించలేదు అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.

pooja-hindi1.jpg

తెలుగులో కొంచెం ఎక్కువ పారితోషికం తీసుకుంటూ, ఎక్కువ మంది స్టాఫ్ ని కూడా పెట్టుకుంటూ వున్న నటీమణుల్లో పూజ హెగ్డే కూడా ఒకరు. అలాంటిది ఇప్పుడు హిందీ సినిమా ఫెయిల్యూర్ తో ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తోంది. ఇంకో హిందీ సినిమా సల్మాన్ ఖాన్ (Salman Khan) తో విడుదలకు సిద్ధంగా వుంది. ఆ సినిమా మీదే ఇప్పుడు ఆశ పెట్టుకుంది. అయితే, ఆ సినిమా విడుదల అయ్యాకనే ఏదైనా కొత్త హిందీ సినిమా సైన్ చెయ్యాలని పూజ హెగ్డే అనుకుంటోంది. ఈలోపు దక్షిణాదిలో ఒకటి రెండు కొత్త సినిమాలు కనక సైన్ చేస్తే, అవి ఇక్కడ ఆడితే, పోయిన పరువు కొంచెం దక్కుతుంది అని భావిస్తున్నట్టుగా తెలిసింది. ఇక్కడ విజయం సాధించాక మళ్ళీ కొత్త హిందీ సినిమాలు ఏమైనా సైన్ చేయవచ్చు అని ఆమె అనుకుంటోంది అని కూడా ఒక టాక్. 2020 లో అల్లు అర్జున్ (Allu Arjun) తో నటించిన 'ఆల వైకుంఠపురం లో' (Ala Vaikuntapuram Lo) సినిమా విజయం సాధించాక, ఆ తరువాత పూజ హెగ్డే మళ్ళీ అంతటి విజయం చూడలేదు. పాపం కిం, కర్తవ్యం అనుకుంటోంది!

Updated Date - 2022-12-31T12:21:01+05:30 IST