Tu Bekhabar: డెబ్యూ హీరో సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటీమణి

ABN , First Publish Date - 2022-12-30T21:50:07+05:30 IST

ర్షల్ ఆర్ట్స్‌లో నిష్ణాతుడు, ఫిజికల్ ఫిట్నెస్ కోచ్ మరియు మెరైన్ ఇంజినీర్ అయిన పవన్ కుమార్ హీరోగా.. గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ సారథి దీపక్ బల్దేవ్ ఠాకూర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో..

Tu Bekhabar: డెబ్యూ హీరో సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటీమణి

హీరోగా తన పరిచయ చిత్రంలోనే జరీనా వహాబ్ (Zarina Wahab) వంటి సీనియర్ నటీమణితో కలిసి నటించడం ఇప్పటికీ తనకు నమ్మశక్యంగా లేదని ఎగ్జైట్ అవుతున్నాడు డెబ్యూ హీరో పవన్ కుమార్ (Pawan Kumar). మార్షల్ ఆర్ట్స్‌లో నిష్ణాతుడు, ఫిజికల్ ఫిట్నెస్ కోచ్ మరియు మెరైన్ ఇంజినీర్ అయిన పవన్ కుమార్ హీరోగా.. గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ సారథి దీపక్ బల్దేవ్ ఠాకూర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెలుగు - హిందీ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘తు బేఖబర్’ (Tu Bekhabar). ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్ర ట్రైలర్ జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు నీలకంఠ (Neelakanta) ఇటీవల ఆవిష్కరించారు. ప్రముఖ బాలీవుడ్ నటి జరీనా వహాబ్ ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించారు.

చీఫ్ మెరైన్ ఇంజినీర్‌గా సముద్రంలో సాహసాలు చేసే పవన్ కుమార్... ఫిజికల్ ఫిట్నెస్ కోచ్ కూడా కావడం విశేషం. అంతేకాదు మార్షల్ ఆర్ట్స్ లోనూ అందె వేసిన చెయ్యి ఇతనిది. ఢిల్లీలో పుట్టి, వైజాగ్‌లో చదివి, హైదరాబాద్‌లో స్థిరపడిన ఈ అచ్చ తెలుగు విజయనగరం కుర్రాడు హీరో కావడం కోసం చిన్నప్పటి నుంచి కలలు కని.. ‘తు బేఖబర్’తో తన కలని తీర్చుకుంటున్నాడు. విధి నిర్వహణలో భాగంగా ప్రస్తుతం ఈజిప్టులో ఉన్న ఈ కుర్రాడు.. నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘తు బేఖబర్’ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటోంది.

Updated Date - 2022-12-30T21:50:13+05:30 IST