Nayanthara: మీ అభిప్రాయాలు, విమర్శలను అంగీకరిస్తున్నాం

ABN , First Publish Date - 2022-12-30T20:35:42+05:30 IST

మహిళా ప్రాధాన్య చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి నయనతార (Nayanthara). అభిమానులందరు లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు. నయన్ తాజాగా నటించిన చిత్రం ‘కనెక్ట్’ (Connect). సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందింది..

Nayanthara: మీ అభిప్రాయాలు, విమర్శలను అంగీకరిస్తున్నాం

మహిళా ప్రాధాన్య చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి నయనతార (Nayanthara). అభిమానులందరు లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు. నయన్ తాజాగా నటించిన చిత్రం ‘కనెక్ట్’ (Connect). సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందింది. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించాడు. విఘ్నేశ్ శివన్ నిర్మించాడు. ఈ నేపథ్యంలో నయనతార బహిరంగ లేఖను విడుదల చేసింది. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. విమర్శలను కూడా స్వీకరిస్తున్నామని చెప్పింది.

‘‘ఈ ఏడాది అద్భుతంగా గడిచింది. నా మనసు ప్రేమాభిమానాలతో నిండిపోయింది. కనెక్ట్ సినిమాను వీక్షించి తమ మద్దతును తెలిపిన అభిమానులు, సినీ ప్రియులకు కృతజ్ఞతలు. షో తర్వాత షోకు టిక్కెట్స్ బుక్ చేసుకొని ప్రోత్సహిస్తున్నవారికీ కూడా ధన్యవాదాలు. ఈ చిత్రం ఓ ప్రత్యేక జోనర్‌‌కు సంబంధించినది. ఆ జోనర్‌కు న్యాయం చేయడానికి మేం ఎంతగానో ప్రయత్నించాం. మా టీం మొత్తం స్క్రిఫ్ట్‌ను తెర మీద ఆవిష్కరించడానికి ఎంతగానో ప్రయత్నించింది. మీ అభిప్రాయం, విమర్శలనూ మేం అంగీకరిస్తున్నాం. భవిష్యత్తులో తెరకెక్కించే చిత్రాలకు వీటిని అనుభవ పాఠాలుగా మలుచుకుంటాం’’ అని నయన్ పేర్కొంది. ఇక నయనతార కెరీర్ విషయానికి వస్తే.. చివరగా టాలీవుడ్‌లో ‘గాడ్ ఫాదర్’ (God Father) లో నటించింది. చిరంజీవి చెల్లెలిగా కనిపించింది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘జవాన్’ లో హీరోయిన్‌గా నటిస్తుంది. షారూఖ్ ఖాన్ కు జొడీగా కనిపించనుంది. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు.

Updated Date - 2022-12-30T20:46:26+05:30 IST