Pawan Kalyan: రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తా

ABN , First Publish Date - 2022-12-28T15:08:26+05:30 IST

పవన్ కళ్యాణ్ ని ఏమి ప్రశ్నలు అడిగి వుంటారు అనే విషయం మీద చర్చ చాలా జోరుగా ఊపందుకుంది, ఊహాగానాలు కూడా బయలుదేరాయి.

Pawan Kalyan: రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తా

అగ్రనటుల్లో ఒకరు, జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ (Jana Sena chief Pawan Kalyan is in Unstoppable seasons 2) అన్ స్టాపబుల్ సీజన్ రెండులో వస్తున్నా సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ కోసం అయన అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈమధ్య కాలం లో ఎటువంటి షోస్ కి హాజరు అవటం కానీ, తన గురించి చెప్పటం కానీ జరగలేదు. అందువల్ల ఈ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి అంత ప్రాముఖ్యం ఏర్పడింది. అయితే పవన్ కళ్యాణ్ ని ఏమి ప్రశ్నలు అడిగి వుంటారు అనే విషయం మీద చర్చ చాలా జోరుగా ఊపందుకుంది, ఊహాగానాలు కూడా బయలుదేరాయి.

అందులో భాగం గానే రాజకీయం మీద కూడా కొన్ని ప్రశ్నలు అడిగినట్టు, అందులో ఒక ప్రశ్న మాకు అందిన సమాచారం ప్రకారం ఈ షో హోస్ట్ పవన్ కళ్యాణ్ ని మీరు రానున్న రోజుల్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అని అడిగారు. (Pawan Kalyan wanted to focus totally on politics, but the public opinion is different) దానికి పవన్ కళ్యాణ్ తాను రాజకీయాల మీదే కంప్లీట్ గా ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నాను అని చెప్పారని తెలిసింది. వెంటనే హోస్ట్ పబ్లిక్ ని ఆ ప్రశ్న వేసి వాళ్ళు ఏమి సమాధానం చెపుతారో చూద్దాం అని అన్నారట. ఈ ప్రశ్నకి అక్కడకి హాజరయిన పబ్లిక్ కొందరు రాజకీయాలు, కొందరు సినిమాలు అంటూ డివైడ్ అయ్యారు. (Public want Pawan Kalyan to do films and also focus on politics)

PK3.jpg

మొత్తం మీద రాజకీయాల మీద ఫోకస్ వున్నా కూడా, సినిమాలు కూడా చెయ్యాలని పబ్లిక్ ఒపీనియన్ వచ్చిందని తెలిసింది. కొందరు ఆ షో హోస్ట్ వెంటనే, పవన్ కళ్యాణ్ ని రెండు రంగాలలోనూ అటు రాజకీయాలు, ఇటు సినిమాలు కూడా చేస్తూ ప్రజలని అలరించాలని సూచించారని తెలిసింది. ఈ ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కావచ్చు అని అంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ పాత సినిమా 'ఖుషి' (Khushi film) ఈ 31 న మళ్ళీ విడుదల అవుతోంది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒక సెన్సషనల్ హిట్ సినిమా. అలాగే పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' (Hari Hara Veeramallu) అనే సినిమా షూటింగ్ లో కూడా చాల బిజీగా వున్నాడు. దీనికి క్రిష్ (Director Krish) దర్శకుడు.

Updated Date - 2022-12-28T15:14:00+05:30 IST