Satyam Rajesh: సత్యం రాజేష్ చిత్రానికి తెలంగాణ మినిస్టర్ క్లాప్‌

ABN, First Publish Date - 2022-12-22T13:49:54+05:30

సత్యం రాజేష్ (Satyam Rajesh), రిహ (Riha), సునీత (Sunitha) హీరోహీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి (Madhusudhan Reddy) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం..

Satyam Rajesh: సత్యం రాజేష్ చిత్రానికి తెలంగాణ మినిస్టర్ క్లాప్‌
Satyam Rajesh New Movie Opening
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్యం రాజేష్ (Satyam Rajesh), రిహ (Riha), సునీత (Sunitha) హీరోహీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి (Madhusudhan Reddy) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీసీ వెల్ఫేర్ మరియు సివిల్ సప్లైస్ మినిస్టర్ గంగుల కమలాకర్ (Gangula Kamalakar) ముఖ్య అతిథిగా హాజరై.. ముహూర్తపు సన్నివేశానికి హీరోహీరోయిన్లపై క్లాప్ కొట్టారు.

ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని.. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుండి ప్రారంభం అవుతుందని చిత్ర దర్శకుడు తెలిపారు. సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, మధు నందన్, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. మంచి కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని రూపొందిందబడుతుందని.. త్వరలోనే చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలియజేశారు. కాగా, ఈ సినిమాకు బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, భీమ్స్ స్వరాలు, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్, భూపతి యాదగిరి ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలను నిర్వహించనున్నారు. (Satyam Rajesh New Movie Launched)

Updated Date - 2022-12-22T13:51:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!