Prabhas: ‘రాజా డీలక్స్’ సెట్ నుంచి పిక్ లీక్

ABN , First Publish Date - 2022-12-25T16:12:54+05:30 IST

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), మారుతి (Maruthi) దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ‘రాజా డీలక్స్’ (Raja Deluxe) అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా హార్రర్ కామెడీగా తెరకెక్కనుంది.

Prabhas: ‘రాజా డీలక్స్’ సెట్ నుంచి పిక్ లీక్

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), మారుతి (Maruthi) దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ‘రాజా డీలక్స్’ (Raja Deluxe) అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా హార్రర్ కామెడీగా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. కానీ, శరవేగంగా షూటింగ్ మాత్రం జరుపుకొంటుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయని సమాచారం. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పిక్ లీకైంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభాస్ అభిమానులందరు విపరీతంగా షేర్ చేస్తున్నారు. లీకైన పిక్‌లో.. సెట్లో ప్రభాస్ కూర్చుని ఉన్నాడు. మారుతితో ముచ్చటిస్తున్నాడు.

‘రాజా డీలక్స్’ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) కీలక పాత్రను పోషిస్తున్నాడని తెలుస్తోంది. ప్రభాస్ తాత పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), రిద్ది కుమార్ (Riddhi Kumar) హీరోయిన్ పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2024లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే.. ‘ఆది పురుష్’ షూటింగ్‌ను గతంలోనే పూర్తి చేశాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌లో విడుదల కానుంది. ‘సలార్’ చిత్రీకరణ 85శాతానికి పైగా పూర్తయింది. మిగిలిన భాగాన్ని జనవరిలోగా పూర్తి చేస్తారు. ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ కూడా 70శాతానికి పైగా పూర్తయింది.

Updated Date - 2022-12-25T16:12:55+05:30 IST