Tollywood: రిపబ్లిక్ డే హాలీడే‌పై కన్నేసిన తెలుగు సినిమాలు!

ABN , First Publish Date - 2022-12-30T19:16:02+05:30 IST

హిట్, ప్లాఫ్‌ల‌తో సంబంధం లేకుండా కొత్త రకం కథలను ఎంచుకుంటున్న నటుడు సుధీర్ బాబు (Sudheer Babu). ‘ప్రేమ కథా చిత్రమ్’, ‘భలే మంచి రోజు’, ‘వి’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు.

Tollywood: రిపబ్లిక్ డే హాలీడే‌పై కన్నేసిన తెలుగు సినిమాలు!

హిట్, ప్లాఫ్‌ల‌తో సంబంధం లేకుండా కొత్త రకం కథలను ఎంచుకుంటున్న నటుడు సుధీర్ బాబు (Sudheer Babu). ‘ప్రేమ కథా చిత్రమ్’, ‘భలే మంచి రోజు’, ‘వి’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ లో చివరగా కనిపించాడు. ఈ చిత్రం విభిన్న ప్రయత్నంగా తెరకెక్కింది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తాజాగా సుధీర్ నటించిన చిత్రం ‘హంట్’ (Hunt). ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.

‘హంట్’ ను భవ్య క్రియేషన్స్ నిర్మించింది. మహేశ్ దర్శకత్వం వహించాడు. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. జనవరి 26న రిలీజ్ చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు పోలీసాఫీసర్ పాత్రను పోషించాడు. సుధీర్‌తో పాటు శ్రీకాంత్, భరత్ కూడా ‘హంట్‌’ లో కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కింది. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన పలు చిత్రాలకు పని చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ 'హంట్'లో స్టంట్స్‌ను కంపోజ్ చేశారు. 'జాన్ విక్ 4'కి కూడా వీరే స్టంట్ కొరియోగ్రాఫర్స్‌గా పనిచేశారు. అతి త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ‘బుట్టబొమ్మ’ కూడా అదే రోజు రిలీజ్ కానుంది. సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించాడు. అనికా సురేంద్రన్, అర్జున్ దాస్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. మరో రెండు తెలుగు చిత్రాలు ‘గీతా సాక్షిగా’, ‘రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం’ కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Updated Date - 2022-12-30T20:45:01+05:30 IST