Waltair Veerayya: హాట్‌ సీన్‌ చిరంజీవితో కాదట!

ABN , First Publish Date - 2022-12-13T18:44:17+05:30 IST

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. శ్రుతీహాసన్‌ కథానాయిక. రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సంక్రాంతికి ఈ చిత్రం థియేటర్‌లతో సందడి చేయనుంది.

Waltair Veerayya: హాట్‌ సీన్‌ చిరంజీవితో కాదట!

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. శ్రుతీహాసన్‌ కథానాయిక. రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సంక్రాంతికి ఈ చిత్రం థియేటర్‌లతో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ఓ హాట్‌ సీన్‌ ఉందని చిత్ర వర్గాల నుంచి సమాచారం. అయితే అది చిరు, శ్రుతీహాసన్‌లపై కాదు.. రవితేజ, కేథరిన్‌లపై అని తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ, కేథరిన్‌ మధ్య హాట్‌హాట్‌ లిప్‌లాక్‌ సీన్‌ ఉందట. ఇటీవల ఆ సన్నివేశాలను చిత్రీకరించారని తెలుస్తుంది. మాములుగా కేథరిన్‌ లిప్‌లాక్‌ సన్నివేశాలు చేయడానికి అంగీకరించదు. ఆమె నటించిన పలు చిత్రాల్లో లిప్‌లాక్‌ సన్నివేశాలు ఉన్నా.. అవి జస్ట్‌ టచ్‌ మీ నాట్‌ అన్నట్లు ఉంటాయి. ఈ చిత్రంలో లిప్‌లాక్‌ డిమాండ్‌ చేయడంతో ఆమె ఒప్పుకోక తప్పలేదట.

ప్రస్తుతం ఈ చిత్ర బృందం విదేశాల్లో ఉంది. అక్కడ చిరంజీవి, శ్రుతిహాసన్‌లపై ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నెల మూడో వారంలోగా షూటింగ్‌తోపాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా పూర్తవుతాయి. తదుపరి ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేస్తారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రెండు గ్లింప్స్‌.. ఒక పాటను విడుదల చేశారు. వచ్చేవారంలో మరో పాట విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Updated Date - 2022-12-13T18:44:18+05:30 IST