Waltair Veerayya-Bobby: నేనిచ్చే లీక్‌ ఇదే!

ABN , First Publish Date - 2022-12-26T13:45:41+05:30 IST

‘‘చిరంజీవి ఊరికే మెగాస్టార్‌ కాలేదు. పనిపట్ల ఆయన చూపించే నిబద్థతే అందుకు నిదర్శనం. ఆయన నటించిన ‘వాల్తేరు వీరయ్య’ను ప్రేక్షకులకు చూపించడం కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా.

Waltair Veerayya-Bobby: నేనిచ్చే లీక్‌ ఇదే!

‘‘చిరంజీవి(Chiranjeevi) ఊరికే మెగాస్టార్‌ కాలేదు. పనిపట్ల ఆయన చూపించే నిబద్థతే అందుకు నిదర్శనం. ఆయన నటించిన ‘వాల్తేరు వీరయ్య’ను (Waltair Veerayya) ప్రేక్షకులకు చూపించడం కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా. ఈ సినిమా విషయంలో భవిష్యత్తులో ఎన్నో సెలబ్రేషన్స్‌ చేసుకోబోతున్నాం. సినిమా చూసి నేను ఇస్తున్న స్టేట్‌మెంట్‌ ఇది(leaked Statement. అంతగా సినిమా మీద నమ్మకం ఉంది’’ అని దర్శకుడు కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) (Ks ravindra)అన్నారు. న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా ఆదివారం ఆయన మెగా అభిమానులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు సంబంధించి మనం ఎన్నో సెలబ్రేషన్స్‌ చేసుకోబోతున్నాం. కథ రాసి, సినిమా తీసి చెబుతున్న మాట కాదిది. సినిమా మొత్తం చూశాకే ధైర్యంగా స్టేట్‌మెంట్‌ ఇస్తున్నా. ‘ఇంద్ర’కు ముందు చిరంజీవి నటించిన రెండు సినిమాలు అంతగా ఆడలేదు. ఆయన నుంచి బ్లాక్‌బస్టర్‌ వస్తే చూడాలని ఒక మెగా అభిమానిగా కసిగా ఎదురుచూశా. అలాంటి సమయంలో నా ఆకలి తీర్చిన చిత్రం ‘ఇంద్ర’. అప్పట్లో కాలర్‌ ఎగరేసి తిరిగా. ఆ సినిమా ఆడుతున్న థియేటర్‌ దగ్గర లాఠీ దెబ్బలు కూడా తిన్నా. అలాంటి నాకు మెగాస్టార్‌ను డైరెక్ట్‌ చేేస అవకాశం వస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. చిరంజీవి నుంచి ఫ్యాన్స్‌ ఎలాంటి ఎలిమెంట్స్‌ కోరుకుంటున్నారో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. చిరంజీవి-శ్రీదేవి పాట అందుకు నిదర్శనం. ఈ చిత్రం మెగా అభిమానులు ఆకలి తీరుస్తుందని బలంగా చెప్పగలను. ఆయన ఊరికే మెగాస్టార్‌ కాలేదు. పనిపట్ల ఆయన చూపించే నిబద్థతే అందుకు కారణం. పొద్దునే సెట్‌లోకి వచ్చేస్టార్‌ు. సాయంత్రం మాతతోనే ఉంటారు. సన్నివేశం పండటానికి ఎంతో కష్టపడతారు. మైనస్‌ 8 డిగ్రీల చలిలో చిరంజీవి-శ్రీదేవి పాట షూట్‌ చేశాం. యూనిట్‌ మొత్తం చలికి వణికిపోతుంటే ఆయన మాత్రం ఎంతో యాక్టివ్‌గా షూట్‌లో పాల్గొన్నారు. ఈ సినిమా గురించి నేనిచ్చే లీక్‌ ఇదే! సినిమా మొదలైనప్పటి నుంచి వీరయ్య ఊసు, ఉనికి వచ్చిన ప్రతిసారీ అభిమానులు ఈలలు వేస్తూనే ఉంటారు. చిరంజీవి కనిపించని సీన్‌లోనూ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆయన ఇంట్రడక్షన్‌ పెను తుపానులో సముద్రంపై షూట్‌ చేశాం. డూప్‌ లేకుండా సుమారు 10 రోజులపాటు ఇంట్రో సీన్స్‌ షూట్‌లో పాల్గొన్నారాయన. ఓ వైపు వాన, మరోవైపు అలల తాకిడి.. మేమంతా ఎంతో కంగారుపడ్డాం. ఆయన మాత్రం చాలా కూల్‌గా యాక్ట్‌ చేశారు. ఎవరూ ఆందోళనకు చెందవద్దు ఈసారి హిట్‌ పక్కా’’ అని బాబీ అన్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.

CHiru.jpg

Updated Date - 2022-12-26T13:45:44+05:30 IST