సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Harihara veeramallu: బాబీ డియోల్‌ ఎందుకంటే...

ABN, First Publish Date - 2022-12-27T16:53:16+05:30

పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో వహిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ ఔరంగజేబు పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవన్‌ కల్యాణ్‌ (pawan kalyan)హీరోగా క్రిష్‌ జాగర్లమూడి (Krish)దర్శకత్వంలో వహిస్తున్న ‘హరిహర వీరమల్లు’(Harihara veera mallu) చిత్రంలో బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ (bobby Deol) ఔరంగజేబు పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన షూటింగ్‌ సెట్‌లో అడుగుపెట్టారు. దీనికి సంబంధించి చిత్ర బృందం ఓ వీడియో విడుదల చేసిన ఆయనకు ఆహ్వానం పలికింది. తాజాగా దర్శకుడు క్రిష్‌ బాబీ డియోల్‌ గురించి మాట్లాడారు. ఆయన్నే ఎంచుకోవడానికి కారణమేంటని తలెత్తిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘‘ఆ పాత్రకు ఎలాంటి వ్యక్తి కావాలనుకున్నామో అలాంటి నటుడే మాకు దొరికారు. ఆ పాత్రకు తగ్గట్లే ఆయన వ్యక్తిత్వం ఉంది. ఆ పాత్రకు పొడవైన, అందమైన నటుడు కావాలి. ఆ రెండు క్వాలిటీ లు బాబీలో ఉన్నాయి. ఆ పాత్రకు పర్ఫెక్ట్‌గా ఫిట్‌ అయ్యారు. ఆయనతో పని చేయడానికి మేమెంత ఎగ్జైటింగా ఉన్నామో ఆయన కూడా అలాగే ఉన్నారు’’ అని క్రిష్‌ చెప్పారు.

పవన్‌కల్యాణ్‌ సరసన నిధీ అగర్వాల్‌ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ ఇప్పటి వరకూ కనిపించని రీతిలో కనిపిస్తారు.

Updated Date - 2022-12-27T16:53:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!