సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kaikala Satyanarayana: ఇండస్ట్రీ వదిలి వెళుతుంటే.. విలన్‌ని చేశారు

ABN, First Publish Date - 2022-12-23T22:18:34+05:30

సినిమా ఇండస్ట్రీలో హీరోగా మొదలైన కైకాల సినీ ప్రస్థానం.. విలన్ పాత్రల వైపు ఎలా దారి తీసిందో.. అప్పట్లో

Kaikala Satyanarayana and NT Ramarao
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినిమా ఇండస్ట్రీలో హీరోగా మొదలైన కైకాల సినీ ప్రస్థానం.. విలన్ పాత్రల వైపు ఎలా దారి తీసిందో.. అప్పట్లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో కైకాల సత్యన్నారాయణ (Kaikala Satyanarayana) వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..

‘‘ఇంటర్‌లో ఉండగా విజయవాడలో నాటకం వేసేటప్పుడు ఓసారి అంతా నన్ను రామారావు‌గారి బ్రదర్‌ అనుకున్నారు. పోటీకి న్యాయమూర్తుల్లో ఒకరైన గరికపాటి రాజారావుగారు వచ్చి నన్ను సినిమాలో హీరోగా పరిచయం చేస్తానన్నారు. ముందు డిగ్రీ సంపాదించాకే ఏదైనా అన్నా. బీఏ అయిపోయాక కె.ఎల్‌.ధర్‌ అని ప్రసాద్‌గారి దగ్గర అసిస్టెంట్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ నన్ను మద్రాసు రమ్మని ఉత్తరం రాశారు. బి.ఎ. సుబ్బారావుగారి దగ్గరకు వెళ్లి చిన్న అసిస్టెంట్‌గా ఇవ్వమని అడిగితే చక్రపాణిగారి దగ్గరకి పంపారు. ఆయన మళ్లీ కేవీ రెడ్డిగారి దగ్గరకి పంపారు. 15 రోజుల తర్వాత రమ్మని, చిన్న పాత్ర చేయమన్నారు. మర్నాడు వాయిస్‌ టెస్ట్‌ చేసి, యు ఆర్‌ సెలెక్టెడ్‌ అన్నారు. కానీ సంక్రాంతికి వెళ్లి తిరిగొచ్చేసరికి ఆ పాత్ర ఆర్‌.నాగేశ్వరరావుకు వెళ్లిపోయింది. కేవీ రెడ్డిగారు తర్వాతి చిత్రంలో ఇస్తానన్నారు. తర్వాత డి.ఎల్‌.నారాయణగారి దగ్గరకు వెళ్తే ఆయన సిపాయి కూతురు సినిమా తీస్తూ అందులో హీరో అవకాశం ఇచ్చారు.

సిపాయి కూతురు సినిమా తీస్తుండగానే మధ్యలో ఆయన మహాదేవ్‌ అనే తమిళ సినిమా డబ్బింగ్‌ హక్కులు కొన్నారు. అది ఫెయిలైంది. మళ్లీ గ్యాప్‌. ఇక వెళ్లిపోదాం అనుకుని.. మద్రాసు చూద్దామని తిరుగుతున్నాం. ఇంతలో విఠలాచార్య గారు ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ చిత్రానికి నా కోసం వెతుకుతున్నారు. నేను వెళ్లిన వెంటనే అగ్రిమెంట్‌ అయిపోయింది. రషెస్‌ అందరికీ నచ్చాయి. పాతికవేల చెక్కిచ్చారు. విలన్‌గా చేస్తే బాగుంటుందని విఠలాచార్య చెప్పి, నాకు తొలి విలన్‌ వేషం ఇచ్చారు. అగ్గిపిడుగు నుంచి నేను-రామారావుగారు కాంబినేషన్‌ అయ్యాం. ఆయనతో కలిసి చాలా పాత్రలు చేశా. నా టాలెంట్‌ను గుర్తించింది రామారావు (Ramarao)గారు, దుక్కిపాటి మధుసూదనరావుగారే..’’ అని కైకాల చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-12-23T22:18:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!