సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Janhvi Kapoor: జాన్వీ కపూర్ కి ఆ ఇద్దరు నటులు బాగా ఇష్టమట

ABN, First Publish Date - 2022-12-29T12:19:32+05:30

ఆర్.ఆర్.ఆర్' (RRR) సినిమా చూసాక, ఎన్ఠీఆర్ నటనకి పెద్ద అభిమానిని అయిపోయాను అని చెపుతూ, ఆ సినిమా తరువాత ఎన్ఠీఆర్ పాత సినిమాలు అన్నీ చూడటం మొదలు పెట్టిందట జాన్వీ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సాంఘీక మాధ్యమాల్లో ఎప్పుడూ కనపడుతూనే ఉంటుంది. ఆమె తన అందమయిన ఫోటోస్ ను తరచూ అప్లోడ్ చేస్తూ ఎప్పుడూ తన అభిమానులతో టచ్ లో ఉంటూ వుంటారు. అలాగే ఆమె ఈమధ్య తరచూ తెలుగు సినిమాలు గురించి, అలాగే తనకు ఇష్టమయిన నటులు గురించి కూడా చెపుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ తెలుగు సినిమాలు, తనకి ఇష్టమయిన తెలుగు నటులు, దర్శకులు గురించి కూడా చెప్పింది. 'ఆర్.ఆర్.ఆర్' (RRR) సినిమా చూసాక, ఎన్ఠీఆర్ నటనకి పెద్ద అభిమానిని అయిపోయాను అని చెపుతూ, ఆ సినిమా తరువాత ఎన్ఠీఆర్ పాత సినిమాలు అన్నీ చూడటం మొదలు పెట్టిందట జాన్వీ. అందులో 'జనతా గారేజ్' (Janatha Garage) కూడా వుంది. (Janhvi Kapoor says that she is a big fan of NTR's performance in 'RRR' and after that she is watching his earlier films)

అలాగే 'పుష్ప' (Pushpa) సినిమా విడుదల అయ్యాక, అల్లు అర్జున్ (Allu Arjun) నటన అద్భుతం అని చెప్తోంది. అల్లు అర్జున్ కి అభిమాని గా మారిందట. (Janhvi Kapoor also a big fan of Allu Arjun after his 'Pushpa' and wanted to work with him and NTR also) తెలుగు నటుల నటన గురించి అంత పొగుడుతూ వున్న జాన్వీ కపూర్ ఈ ఇద్దరితో నటించాలని కూడా వుంది అని చెప్తోంది. అల్లు అర్జున్ పక్కన ఆఫర్ వస్తే తప్పక నటిస్తా, అలాగే ఎన్ఠీఆర్ తో కూడా నటించాలన్న తన కోరిక వ్యక్త పరిచింది జాన్వీ కపూర్.

ప్రతి ఇంటర్వ్యూ లోనూ తెలుగు నటుల, సినిమాల గురించి మాట్లాడుతున్న జాన్వీ కపూర్ ఈసారి తన ఫోకస్ తెలుగు పరిశ్రమ వేపు పెట్టినట్టుంది. ఎందుకంటే ఏ దర్శకులతో పని చేయాలనీ వుంది అని అడిగితే, టక్కున సుకుమార్ (Director Sukumar) అని చెప్పింది. అలాగే దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) తో కూడా పని చెయ్యాలని వుంది అని చెప్పింది. ఇంకేమి మరి, కొరటాల ఇప్పుడు ఎన్ఠీఆర్ తో పని చేస్తున్నాడు కాబట్టి, ఆ సినిమాకి హీరోయిన్ ని వెతుక్కోనవసరం లేదు. జాన్వీ ఆల్రెడీ చెప్పేసింది కాబట్టి, జస్ట్ ఆమెని అప్రోచ్ అయితే చాలు. (Sukumar and Koratala Siva are the two directors that Janhvi Kapoor wanted to work with in Telugu, she says).

Updated Date - 2022-12-29T12:19:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!