RRR: తెలుగు సినిమాపై ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నటి ప్రశంసలు.. ఓ అద్భుతమంటూ..

ABN , First Publish Date - 2022-12-29T12:52:01+05:30 IST

‘ఆర్ఆర్ఆర్’ విడుదలై తొమ్మిది నెలలు గడిచిపోయినా ఇప్పటికీ ఆ మూవీ మేనియా తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా ఏదో ఓ చోట.. ఎవరో ఒకరు ఈ చిత్రం గురించి మాట్లాడుతూనే ఉన్నారు.

RRR: తెలుగు సినిమాపై ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నటి ప్రశంసలు..  ఓ అద్భుతమంటూ..
RRR

‘ఆర్ఆర్ఆర్’ (RRR) విడుదలై తొమ్మిది నెలలు గడిచిపోయినా ఇప్పటికీ ఆ మూవీ మేనియా తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా ఏదో ఓ చోట.. ఎవరో ఒకరు ఈ చిత్రం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. మొదట థియేటర్స్‌లో విడుదలై దాదాపు రూ.1200 కోట్ల వసూళ్లని కొల్లగొట్టింది. అనంతరం ఓటీటీలో విడుదలైన తర్వాత ఈ మూవీ క్రేజ్ ప్రపంచం మొత్తం పాకింది. హాలీవుడ్‌తోపాటు వివిధ దేశాలకు చెందిన సినీ ప్రముఖులు, రచయితలు ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ (Game of Thrones) ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి నథాలీ ఇమ్మాన్యుయేల్ (Nathalie Emmanuel) ‘ఆర్ఆర్ఆర్’పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు.

నథాలీ ట్విట్టర్‌ (Twitter)లో ఆర్ఆర్ఆర్ ఓ అద్భుతమైన సినిమా అని తనదైన శైలిలో ప్రశంసించింది. ఆలియా భట్ చేసిన సీత పాత్ర చాలా బావుందని తెలిపింది. అలాగే క్లైమాక్స్ ఫైట్‌ సీన్‌లో భీమ్ భుజాలపై రామ్‌ని మోసే సీన్, ఆ ఫైట్‌పై కూడా ప్రశంసలు కురిపించింది. అంతేకాకుండా.. డ్యాన్స్ అయితే మామూలుగా లేదని చెప్పింది.

కాగా.. ఓ వైపు ఈ చిత్రాన్ని ప్రశంసించే వారుండగా.. మరోవైపు విమర్శించేవారు కూడా ఉన్నారు. ప్రముఖ బాలీవుడ్ సినీయర్ నటి రత్న పటాక్ షా మాట్లాడుతూ.. ‘‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలు ప్రస్తుతం చాలా పాపులర్. కానీ అది మనల్ని వెనక్కి తీసేకెళ్లే చిత్రం. ప్రజస్వామ్యంలో ఉండడం వల్ల మనం ఏదైనా చేయొచ్చని కొందరు అనుకుంటారు. కొందరు కావాలని ఇలాంటి సినిమాలని మన మీద రుద్దుతున్నారు. మనం కూడా వాటిని యాక్సెప్ట్ చేశాం’ అని విమర్శలు గుప్పించింది.

Updated Date - 2022-12-29T12:55:06+05:30 IST