Celebs condolence to Chalapatirao: ఆప్త మిత్రుడిని కోల్పోయాం!

ABN , First Publish Date - 2022-12-25T12:09:56+05:30 IST

సీనియర్‌ యాక్టర్‌ చలపతిరావు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ మేరకు చిరంజీవి ట్విట్టర్‌ వేదికగా సంతాపం తెలిపారు.

Celebs condolence to Chalapatirao: ఆప్త మిత్రుడిని కోల్పోయాం!

సీనియర్‌ యాక్టర్‌ చలపతిరావు (Rip Chalaptirao)మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ మేరకు చిరంజీవి (Chiranjeeviట్విట్టర్‌ వేదికగా సంతాపం తెలిపారు. (chalapati rao passed away)

‘‘విక్షణమైన నటుడు, తనదైన శైలితో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న చలపతిరావుగారి అకాల మరణ వార్త నన్ను కలచివేసింది. ఎన్నో చిత్రాల్లో ఆయనతో నేను కలిసి నటించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, రవి బాబుకి, ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’’ అని అన్నారు.

‘‘చలపతిరావు గారి హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసింది. తన విలక్షణమైన నటనతో ప్రేక్షకు?ను అలరించారు. నిర్మాతగా మంచి చిత్రాలు తీశారు. ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమ మంచి నటుణ్ణి కోల్పోయింది. మా కుటుంబంతో ఆయనకు ఆత్మీయబంధం ఉంది. నాన్నగారితో కలసి ఎన్నో చిత్రాల్లో నటించారు. నా చిత్రాల్లోనూ మంచి పాత్రలు పోషించారు. మా కుటుంబ సభ్యుడైన ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’

- నందమూరి బాలకృష్ణ(Balakrishna)

‘‘చలపతి రావు నాకు ఆప్త మిత్రుడు. నేను తెరకెక్కించిన ఎన్నో చిత్రాల్లో ఆయన నటించారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవారు’’.

-ముత్యాల సుబ్బయ్య

‘‘చలపతిరావు ఎంతో మంచి వ్యక్తి. ఎప్పుడూ సరదాగా ఉండేవారు. ప్రమాదం తర్వాత నుంచి ఆయన ఎక్కువగా బయటకు రాలేదు. జోకులు వేస్తూ అందర్నీ నవ్వించేవారు. ఇండస్ర్టీలో అందరితో స్నేహంగా ఉండేవారు. ఆయన మాకెంతో ఆప్తుడు. మూడు రోజుల క్రితం కూడా షూట్‌లో పాల్గొన్నారు. ఇండస్ర్టీకి చెందిన ప్రముఖులు వరుసగా మృతి చెందడం దురదృష్టకరం’’

- దగ్గుబాటి సురేశ్‌

‘‘ఇండస్ట్రీలో నా ఆప్తమిత్రుడు. మంచి మనసున్న మనిషి. ఆయనతో ఎన్నో సినిమాలు చేశాను. ఇటీవల ఆయనతో మాట్లాడాను. త్వరలో కలుద్దాం అనుకున్నాం. ఇంతలోనే ఇలా జరగడం బాధాకరం’’

- ఢిల్లీ రాజేశ్వరీ

Updated Date - 2022-12-25T12:49:23+05:30 IST