Chalapathi Rao: ముగిసిన చలపతి రావు అంత్యక్రియలు

ABN , First Publish Date - 2022-12-28T11:06:10+05:30 IST

సీనియర్ క్యారక్టర్ నటుడు చలపతి రావు (Senior actor Chalapathi Rao's last rites were held today morning at Maha Prasthanam) అంత్యక్రియలు ముగిసాయి.

Chalapathi Rao: ముగిసిన చలపతి రావు అంత్యక్రియలు
File photo of Chalapathi Rao

సీనియర్ క్యారక్టర్ నటుడు చలపతి రావు (Senior actor Chalapathi Rao's last rites were held today morning at Maha Prasthanam) అంత్యక్రియలు ముగిసాయి. చలపతి రావు ఆదివారం ఉదయం అతని కుమారుడు రవిబాబు ఇంట్లో చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే చలపతి రావు గారి కుమార్తెలు అమెరికాలో ఉన్నందున వారు రావటానికి రెండు రోజులు పడుతుంది కావున, వాళ్ళు తమ తండ్రి చివరి చూపు కోసమని, చలపతి రావు గారి పార్థివ దేహాన్ని, మహా ప్రస్థానం లోని ఫ్రీజర్ లో భద్రపరచడం జరిగింది. చలపతి రావు గారి కుమార్తెలు మంగళ వారం రాత్రి హైదరాబాద్ చేరుకొని, తమ తండ్రిని కడసారి చూసుకున్నారు. తరువాత బుధవారం ఉదయం మహా ప్రస్థానం లో చలపతి రావు గారి అంత్యక్రియలు అతని కుమారుడు రవిబాబు నిర్వహించారు.

chalapai1.jpg

కుటుంబ సభ్యుల సమక్షంలో మహా ప్రస్థానం విద్యుత్ దహన వాటిక వద్ద ముగిసిన చలపతిరావు అంత్యక్రియలు అని ఒక పత్రికా ప్రకటనలో కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ అంత్యక్రియలకు, చలపతి రావు గారి కుటుంబంతో బాగా సన్నిహితంగా వున్న చిత్ర పరిశ్రమలోని కొంతమంది హాజరయ్యారు. వారిలో నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు (Daggubati Suresh Babu), దామోదర ప్రసాద్ (Damodara Prasad), బండ్ల గణేష్ (Bandla Ganesh), అలాగే దర్శకులు శ్రీవాస్ (Sri Vaas), బోయపాటి శ్రీను (Boyapati Sreenu), బి గోపాల్ (B Gopal) వున్నారు. ఇంకా నటుడు మంచు మనోజ్ (Manchu Manoj), రఘుబాబు (Raghubabu) లు అల్లరి రవిబాబు కి బాగా సన్నిహితులు అందుకని వారు కూడా హాజరయిన వారిలో వున్నారు. తెలుగు దర్శకుల సంగం అధ్యక్షుడు కాశీ విశ్వనాధ్ (Kasi Viswanath) కూడా ఈ అంత్యక్రియలకు హాజరయిన వారిలో వున్నారు.

Updated Date - 2022-12-28T11:06:12+05:30 IST