Year Ender 2022: టాలీవుడ్ తెరపై మెరిసిన బాలీవుడ్ తారలు

ABN , First Publish Date - 2022-12-28T16:08:59+05:30 IST

‘బాహుబలి’ (Baahubali) తర్వాత తెలుగు సినిమాల స్థాయి పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో రూపొందే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఫలితంగా అన్ని ఇండస్ట్రీలు టాలీవుడ్ వైపు చూస్తున్నాయి.

Year Ender 2022: టాలీవుడ్ తెరపై మెరిసిన బాలీవుడ్ తారలు

‘బాహుబలి’ (Baahubali) తర్వాత తెలుగు సినిమాల స్థాయి పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో రూపొందే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఫలితంగా అన్ని ఇండస్ట్రీలు టాలీవుడ్ వైపు చూస్తున్నాయి. తెలుగు మూవీస్‌లో ఛాన్స్ వస్తే నటించేందుకు హిందీ నటులు వెనుకాడటం లేదు. కాగా, ఈ ఏడాది టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ తారలపై ఓ లుక్కేద్దామా మరి..

Alia-Bhatt.gif

ఆలియా భట్ (Alia Bhatt):

‘రాజీ’, ‘గంగూబాయి కతియావాడి’ వంటి సినిమాలతో తనలో మంచి నటి ఉందని నిరూపించుకుంది ఆలియా భట్. ఈ ఏడాది ఆమె ‘ఆర్ఆర్ఆర్’ (RRR)తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. సీత పాత్రతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. స్క్రీన్ మీద కనిపించింది కాసేపే అయినప్పటికి తన నటనతో ఆకట్టుకుంది.

Anupam-Kher.gif

అనుపమ్ ఖేర్ (Anupam Kher):

ఏ పాత్రను అయినా అలవోకగా పోషించే నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher). నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ లో అతిథి పాత్రలో మెరిశాడు. కృష్ణ తత్వం గురించి చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ‘కార్తికేయ 2’ పాన్ ఇండియాగా తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్ల వసూళ్లను రాబట్టింది.

Ananya-Panday.gif

అనన్య పాండే (Ananya Panday):

చిన్న తనంలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ అనన్య పాండే. విజయ్ దేవర కొండ హీరోగా నటించిన ‘లైగర్’ (Liger) తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అనన్య ఈ చిత్రంతో క్యూట్ లుక్స్‌తో యూత్‌‌ను ఆకట్టుకుంది. భారీ అంచనాల మధ్య వచ్చిన లైగర్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. డిస్ట్రిబ్యూటర్స్‌కు భారీ నష్టాన్ని మిగిల్చింది.

Salman-Khan.gif

సల్మాన్ ఖాన్ (Salman Khan):

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’ లో అతిథి పాత్రను పోషించాడు. మసూమ్ భాయ్ పాత్రతో ప్రేక్షకులను అలరించాడు. రెమ్యూనరేషన్ తీసుకోకుండా సల్మాన్ ఈ చిత్రాన్ని చేయడం చెప్పుకోదగ్గ విశేషం. మాలయాళం ఇండస్ట్రీ హిట్ ‘లూసిఫర్’ కు రీమేక్‌గా ‘గాడ్ ఫాదర్’ రూపొందింది.

Ajay-Devgn.gif

అజయ్ దేవగణ్ (Ajay Devgn):

ఎస్‌ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అజయ్ దేవగణ్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో స్వాతంత్ర్య సమరయోధుడిగా, రామ్ చరణ్‌ తండ్రి పాత్రలో కనిపించాడు. లోడ్, ఎయిమ్, షూట్ వంటి ఇంటెన్స్ డైలాగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ వైడ్‌గా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

Updated Date - 2022-12-28T16:16:25+05:30 IST