Biggboss 6: రేవంత్‌ నమ్మకం నిజమైంది!

ABN , First Publish Date - 2022-12-19T13:28:50+05:30 IST

‘బిగ్‌బాస్‌ 6’ టైటిల్‌ గెలిచేది నేనే రాసి పెట్టుకోండి అని సింగర్‌ రేవంత్‌ ఎన్నోసార్లు చెప్పాడు. సీజన్‌ మొదలైన ఆరోవారం నుంచే ఆయన తన ఆట మీద నమ్మకంగా ఉన్నాడు.

Biggboss 6: రేవంత్‌ నమ్మకం నిజమైంది!

‘బిగ్‌బాస్‌ 6’(Biggboss6) టైటిల్‌ గెలిచేది నేనే రాసి పెట్టుకోండి అని సింగర్‌ రేవంత్‌ (Singer revanth)ఎన్నోసార్లు చెప్పాడు. సీజన్‌ మొదలైన ఆరోవారం నుంచే ఆయన తన ఆట మీద నమ్మకంగా ఉన్నాడు. గీతూ కూడా అదే మాట అంటుండేవారు. కానీ గీతూ మధ్యలోనే ఊహించిని విధంగా ఎలిమినేట్‌ అయ్యారు. అయితే రేవంత్‌ మాత్రం కొన్నిసార్లు ఆటలో బెస్ట్‌ ఇవ్వలేకపోయినా ఫైనల్‌గా గెలిచేది నేనే’ అని గట్టిగా నమ్మాడు. చివరికి అదే నిజమైంది. ‘బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-6’ విజేతగా రేవంత్‌ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. ఈ సీజన్‌లో మొత్తం 21 మంది కంటెస్టెంట్‌లు ‘బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లగా రేవంత్‌, శ్రీహాన్‌, ఆదిరెడ్డి, కీర్తిభట్‌, రోహిత్‌ టాప్‌ 5లో వరకూ వచ్చారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఫినాలే మొదట రోహిత్‌, తర్వాత ఆదిరెడ్డి మూడో వ్యక్తిగా కీర్తి ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చారు. టాప్‌-2లో శ్రీహాన్‌, రేవంత్‌ నిలిచారు. గోల్డెన్‌బాక్స్‌తో హౌస్‌లోకి వచ్చిన నాగార్జున ఇద్దరికీ అదిరే ఆఫర్‌ ఇచ్చాడు. ప్రైజ్‌ మనీలో సగం మొత్తం తీసుకుని హౌస్‌ నుంచి వెళ్లిపోవచ్చని సూచించాడు. తొలుత నో అన్నారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ.30 లక్షలకు పెంచారు. అప్పుడు కూడా ఇద్దకూ ముందడుగు వేయలేదు. చివరికి ఆ మొత్తాన్ని రూ.40 లక్షలు చేయడంతో శ్రీహాన్‌ ఆ మొత్తాన్ని స్వీకరించాడు. దీంతో రేవంత్‌ బిగ్‌బాస్‌-6 ట్రోఫీ, రూ.10 లక్షలు దక్కాయి. రన్నర్‌గా నిలిచిన శ్రీహాన్‌ రూ.40 లక్షలు ఇంటికి తీసుకెళ్లాడు. ఆదివారం జరిగిన ఫినాలే ఎపిసోడ్‌లో ఈ సీజన్‌లో ఎలిమినేట్‌ అయిన ఇంటి సభ్యులు అందరూ హాజరై సందడి చేశారు.Biggboss6 )

నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ సీజన్‌ సెప్టెంబర్‌ 4న ప్రారంభమైంది. 105 రోజులపాటు సాగింది.

వివిధ రంగాలకు చెందిన 21మంది కంటెస్టెంట్లు బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టారు. ఈసారి వైల్డ్‌ కార్ట్‌ ఎంట్రీ సౌకర్యం కల్పించలేదు.

రేవంత్‌, శ్రీహాన్‌, కీర్తి, ఆది, రోహిత్‌, సుదీప, చలాకీ చంటి, ఆరోహి, నేహా, అభినయ, షానీ, శ్రీసత్య, ఇనయ, ఫైమా, రాజ్‌, మెరీనా, వసంతి, బాలాదిత్య, గీతూ రాయల్‌, సూర్య, అర్జున్‌ పాల్గొన్నారు. రేవంత్‌ రెండుసార్లు కెప్టెన్‌ అయ్యాడు. గీతూ, సూర్య, చలాకీ చంటి లాంటి కంటెస్టెంట్లు ఊహించని రీతిలో ఎలిమినేట్‌ అయ్యారు.

BB6.jpg

Updated Date - 2022-12-19T13:42:57+05:30 IST