Nandamuri Balakrishna: తారకరామ ఓ చరిత్ర!

ABN , First Publish Date - 2022-12-15T13:35:03+05:30 IST

‘‘తారకరామ థియేటర్‌కి ఓ చరిత్ర ఉంది. అమ్మానాన్నల పేర్లు కలిసి వచ్చేలా కట్టిన దేవాలయం ఇది. మా మోక్షజ్ఞ తారకరామ తేజ నామకరణాన్ని నాన్న ఇక్కడే చేశారు. సునీల్‌ నారంగ్‌ పర్యవేక్షణలో కొత్త హంగులతో ఈ థియేటర్‌ నిర్వహణ కొనసాగనుండడం ఆనందంగా ఉంది.

Nandamuri Balakrishna: తారకరామ ఓ చరిత్ర!

‘‘తారకరామ థియేటర్‌కి(Tarakarama) ఓ చరిత్ర ఉంది. అమ్మానాన్నల పేర్లు కలిసి వచ్చేలా కట్టిన దేవాలయం ఇది. మా మోక్షజ్ఞ తారకరామ తేజ నామకరణాన్ని నాన్న (Nandamuri Taraka ramarao)ఇక్కడే చేశారు. సునీల్‌ నారంగ్‌ పర్యవేక్షణలో కొత్త హంగులతో ఈ థియేటర్‌ నిర్వహణ కొనసాగనుండడం ఆనందం(Balakrishna)గా ఉంది. మా అనుబంధం ఇలాగే కొనసాగాలి’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్‌ కాచిగూడలోని తారకరామ థియేటర్‌ని కొత్త హంగలుతో ముస్తాబైంది. ఏషియన్‌ తారకరామ పేరుతో బాలకృష్ణ పునః ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ‘‘ఇదొక చరిత్ర ఉన్న థియేటర్‌. 1978లో ‘అక్బర్‌ సలీం అనార్కలి’తో ఈ హాలుని ప్రారంభించాం. ‘డాన్‌’ సినిమా 525 రోజులు ఆడింది. నా సినిమాలు ‘మంగమ్మగారి మనవడు’, ‘ముద్దుల మావయ్య’, ‘ముద్దుల కృష్ణయ్య’, ‘అనసూయమ్మగారి అల్లుడు’, వంటి చిత్రాలు అద్భుతంగా ఆడాయి. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌కీ, మా నాన్నకీ మంచి సంబంధం ఉండేవి. ఇప్పుడు సునీల్‌ నారంగ్‌ పర్యవేక్షణలో ఈ థియేటర్‌ నిర్వహణ కొనసాగడం ఆనందంగా ఉంది. సినిమా టికెట్‌ ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉంచడం పరిశ్రమకు మంచిది. ఓటీటీ వేదిక వల్ల థియేటర్‌లకు గట్టి పోటీ ఎదురవుతోంది. మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్‌కి వస్తారు. థియేటర్లో సినిమా చూస్తే ఆ అనుభూతి వేరు’’ అని అన్నారు.

Tarakarama---Balakrishna-2.jpg

Updated Date - 2022-12-15T13:35:24+05:30 IST