సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Anupama Parameswaran: మేకర్స్‌కు కిక్‌... అనుపమాకు చెక్కు!

ABN, First Publish Date - 2022-12-31T10:58:25+05:30

మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ బిజీ ఆర్టిస్ట్‌ అయ్యారు. కెరరీ బిగినింగ్‌ నుంచి చిన్న చితకా విజయాలతో ముందుకెళ్తున్న ఈ కేరళ కుట్టి ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకెళ్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

18 pages, karthikeya 2 , anupama remunaration

మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ (Anupama parameswaran) బిజీ ఆర్టిస్ట్‌ అయ్యారు. కెరరీ బిగినింగ్‌ నుంచి చిన్న చితకా విజయాలతో ముందుకెళ్తున్న ఈ కేరళ కుట్టి ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకెళ్తుంది. అంతే కాదు అవకాశాలూ బాగానే అందుకుంటోంది. నిఖిల్‌ (Nikhil karthikeya2) సరసన ఆమె నటించిన ‘కార్తికేయ2’ ప్యాన్‌ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. ఇటీవల అదే హీరో సరసన గీతా ఆర్ట్స్‌బ్యానర్‌లో నటించిన ‘18 పేజెస్‌’ (18 pages) చిత్రం కూడా హిట్‌ టాక్‌తో ముందుకెళ్తుంది. తాజాగా ఆమె కీలక పాత్రలో నటించగా ఓటీటీలో విడుదలైన ‘బటర్‌ఫ్లై’ (butterfly) చిత్రం కూడా చక్కని విజయం అందుకుంది. దీనితో ఆమెకు మరింత డిమాండ్‌ పెరిగింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆమె ఇదే మంచి తరుణం అనుకుని తన పారితోషికాన్ని పెంచేసిందని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఆమె రూ 50 నుంచి 60 లక్షలు రెమ్యునరేషన్‌ తీసుకునేదని టాక్‌. వరుగా రెండు భారీ విజయాలు రావడంతో ఇప్పుడు ఒక్కసారిగా కోటి రూపాయలకు తన పారితోషికం డిమాండ్‌ (Remunaration Demand) చేస్తుందని సమాచారం. అయినా నిర్మాతలు ఆమెను కథానాయికగా కావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం బడ్జెట్‌లో సినిమాలు తీసే మేకర్స్‌కు ఆమెతో పనిచేయడం కిక్‌.. అనుపమాకు చెక్కు అన్నట్లుగా టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం అనుపమా తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో మూడు చిత్రాలతో బిజీగా ఉంది.

Updated Date - 2022-12-31T10:58:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!