Sravanti Ravikishore: ‘కిడ’కు మరో పురస్కారం

ABN , First Publish Date - 2022-12-24T18:01:22+05:30 IST

ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’. ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పనోరమాలో ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

Sravanti Ravikishore: ‘కిడ’కు మరో పురస్కారం

ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్‌(Sravanthi Ravi kishor) నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’. ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పనోరమాలో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మరో పురస్కారాన్ని అందుకుంది. 20వ చెన్నై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో (Chennai international film festival)ఉత్తమ చిత్రంగా ‘కిడ’కు( KIda in channai film festival) పురస్కారం దక్కింది. నిర్మాత స్రవంతి రవికిశోర్‌, దర్శకుడు ఆర్‌.ఎ వెంకట్‌.. అవార్డుతో పాటు రివార్డుగా ఇద్దరికీ చెరొక లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ చిత్రంలో నటించిన పూ రాము ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు. ‘స్రవంతి’ రవికిశోర్‌ మాట్లాడుతూ ‘’గోవాలో ఈ ఏడాది జరిగిన ఇఫీలోని పనోరమాలో ‘కిడ’ను ప్రదర్శించారు. అప్పుడు స్టాండింగ్‌ ఓవేషన్‌ లభించింది. ఇప్పుడు చెన్నై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అంతకు మించిన ఆదరణ లభించింది. ఉత్తమ చిత్రంగా ‘కిడ’ నిలిచింది. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు.

Updated Date - 2022-12-24T18:03:45+05:30 IST