Allu Arjun: ఆయన వల్లే నేను ఇలా ఉన్నా!

ABN , First Publish Date - 2022-12-20T00:16:14+05:30 IST

నిఖిల్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా సూర్య ప్రతాప్‌ తెరకెక్కించిన చిత్రం ‘18 పేజెస్‌’ గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అల్లు అర్జున్‌ అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

Allu Arjun: ఆయన వల్లే నేను ఇలా ఉన్నా!

నిఖిల్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా సూర్య ప్రతాప్‌ తెరకెక్కించిన చిత్రం ‘18 పేజెస్‌’ గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అల్లు అర్జున్‌ అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘‘నటుడిగా నేనీ స్థాయిలో ఉన్నానంటే సుకుమార్‌ కారణం. ఆయన లేకపోతే నా లైఫ్‌ ఇలా ఉండేది కాదని నేనెప్పుడూ అనుకుంట నాకు బాగా కావలసిన వారంతా కలిసి తీసిన సినిమా ఇది. సొంత ఓటీటీలో కాకుండా థియేటర్‌లో విడుదల చేయాలనుకునే నిర్మాత మా నాన్నను గౌరవిస్తా. గోపీ సుందర్‌ సంగీతం బావుంది. ఆయనతో పని చేసే అవకాశం వస్తుందని భావిస్తున్నా. ఆర్య నుంచి సూర్య ప్రతాప్‌ తెలుసు. ఆలస్యమైనా మంచి చిత్రాలే తీయాలనుకుంటారు. హ్యాపీడేస్‌ నుంచి నిఖిల్‌ను గమనిస్తున్నా. ఇలాంటిమంచి కథల్ని ఎలా ఎంపిక చేసుకుంటావ్‌ అని అతన్ని ఓసారి అడిగా. ఈ చిత్రం అందరికీ నచ్చాలని కోరుకుంటున్నా. ఇలాంటి కథని సుకుమార్‌ ప్రొడ్యూస్‌ చేేస్త 18 పేజెస్‌.. అదే ఆయన డైరెక్షన్‌ చేేస్త 118 పేజెస్‌ అవుతుంది(నవ్వుతూ) ‘పుష్ప 2’.. అసలు తగ్గేదే లే’’ అని అల్లు అర్జున్‌ అన్నారు.

‘‘రాజమౌళి, సుకుమార్‌ ప్యాన్‌ ఇండియా చిత్రాలకు దారి వేశారు. ఆ స్ఫూర్తితోనే ‘కార్తికేయ 2’ను తీసుకొచ్చాం. సుకుమార్‌ రాసిన కథ (18 పేజెస్‌)లో నేను నటించడం ఆనందంగా ఉంది’’ అని నిఖిల్‌ అన్నారు. .

Updated Date - 2022-12-20T00:16:18+05:30 IST