Shamna kasim: పూర్ణ శుభవార్త!

ABN , First Publish Date - 2022-12-31T11:08:02+05:30 IST

మలయాళ బ్యూటీ పూర్ణ సిల్వర్‌ స్ర్కీన్‌తోపాటు బుల్లితెరపై పలు షోలకు న్యాయనిర్ణేతగా సందడి చేస్తున్నారు. ఇటీవల వివాహబంధంలో అడుగుపెట్టిన ఆమె అభిమానులకు శుభవార్త చెప్పింది.

Shamna kasim: పూర్ణ శుభవార్త!

మలయాళ బ్యూటీ పూర్ణ (Poorna) సిల్వర్‌ స్ర్కీన్‌తోపాటు బుల్లితెరపై పలు షోలకు న్యాయనిర్ణేతగా సందడి చేస్తున్నారు. ఇటీవల వివాహబంధంలో అడుగుపెట్టిన ఆమె అభిమానులకు శుభవార్త (poorna good news)చెప్పింది. త్వరలో తాను తల్లి కాబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. ఈ ఏడాది జూన్‌ 12న దుబాయ్‌లో వ్యాపారవేత్త ఆసిఫ్‌ అలీతో పూర్ణ వివాహం జరిగింది. పెద్దలు నిశ్చయించిన వివాహం ఇరువైపు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంజరిగింది. తాజాగా పూర్ణ తల్లి కాబోతున్న విషయం వెల్లడించడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. (poorna pregnency)

poorna-2.jpg

Updated Date - 2022-12-31T11:08:04+05:30 IST