పెళ్ళికి రెడీ అంటోన్న యంగ్ హీరోయిన్

ABN , First Publish Date - 2022-04-05T00:53:38+05:30 IST

ఆమె సంపూర్ణంగా కోలుకుని అడపాదడపా సినిమాల్లో నటిస్తోంది. అదేసమయంలో తాను సినిమా షూటింగ్‌లకు ఫిట్‌గా ఉన్నానని తెలిపేందుకు ఈ మధ్య హాట్ హాట్‌గా ఫొటోషూట్లతో బిజీగా ఉంటోంది. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న

పెళ్ళికి రెడీ అంటోన్న యంగ్ హీరోయిన్

గత యేడాది కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న నటి యాషిక ఆనంద్‌. ప్రస్తుతం ఆమె సంపూర్ణంగా కోలుకుని అడపాదడపా సినిమాల్లో నటిస్తోంది. అదేసమయంలో తాను సినిమా షూటింగ్‌లకు ఫిట్‌గా ఉన్నానని తెలిపేందుకు ఈ మధ్య హాట్ హాట్‌గా ఫొటోషూట్లతో బిజీగా ఉంటోంది. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. అయితే తాజాగా యాషిక.. సోషల్ మీడియాలో నెటిజన్లతో కాసేపు ముచ్చటించింది. అందులో ఓ నెటిజన్ ఆమె పెళ్లి ప్రస్తావనని కూడా తీసుకువచ్చాడు. 


నెటిజన్ అడిగిన ప్రశ్నకి ‘‘నేను త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నాను. అందుకు నా తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. జీవితంలో స్థిరపడేందుకు ఇదే సరైన సమయం. అయినా సినిమాలకు దూరంకాను. ప్రేమ మనకు అచ్చుబాటు కాదు. పెద్దలు నిశ్చయించిన పెళ్ళే చేసుకుంటా. అందరి ఆశీస్సులు కావాలి’’ అంటూ యాషిక ఆనంద్‌ సమాధానమిచ్చింది. 



Updated Date - 2022-04-05T00:53:38+05:30 IST