సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Yash: 700 సెల్ఫీలు!

ABN, First Publish Date - 2022-12-18T12:30:24+05:30

‘కేజీయఫ్‌’ సినిమా తర్వాత యశ్‌ పేరు ఓ బ్రాండ్‌గా మారిపోయింది. దక్షిణాది అతని ఫాలోయింగ్‌ విపరీతంగా పెరిగింది. పెద్ద ఫ్యాన్‌ బేస్‌ని క్రియేట్‌ చేసుకున్నారు. తాజాగా యశ్‌ చేసిన ఓ పనికి అభిమానులు రెట్టింపు అభిమానాన్ని చూపిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘కేజీయఫ్‌’ (KGF)సినిమా తర్వాత యశ్‌ (yash)పేరు ఓ బ్రాండ్‌గా మారిపోయింది. దక్షిణాది అతని ఫాలోయింగ్‌ విపరీతంగా పెరిగింది. పెద్ద ఫ్యాన్‌ బేస్‌ని క్రియేట్‌ చేసుకున్నారు. తాజాగా యశ్‌ చేసిన ఓ పనికి అభిమానులు రెట్టింపు అభిమానాన్ని చూపిస్తున్నారు. బెంగుళూర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి యశ్‌ అతిథిగా హాజరయ్యారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు దూర ప్రాంతాల నుంచీ వచ్చారు. యశ్‌తో ఫొటో దిగాలని వారంతా ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ని కోరగా వారు గ్రూప్‌ ఫొటో అవకాశం మాత్రమే ఇచ్చారు. అది అర్ధం చేసుకున్న యశ్‌ వారితో మాట్లాడి అక్కడికి వచ్చిన (700 Selfies with fans) మందితో విడివిడిగా సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. యశ్‌ అభిమానులపై చూపించిన ప్రేమ, ఓర్పునకు అభిమానులు ఫిదా అయిపోయారు. సోషల్‌ మీడియాలో రియల్‌ సూపర్‌స్టార్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండటం అంటే ఇదే అంటూ ప్రశంసిస్తున్నారు.

Updated Date - 2022-12-18T12:30:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!