ఆకట్టుకుంటున్న విశాల్ 'లాఠి' ఫస్ట్ లుక్..

ABN , First Publish Date - 2022-04-07T13:29:01+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విశాల్ పక్కా కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలను చేసున్న సంగతి తెలిసిందే. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళుతున్నాడు.

ఆకట్టుకుంటున్న విశాల్ 'లాఠి' ఫస్ట్ లుక్..

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విశాల్ పక్కా కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలను చేసున్న సంగతి తెలిసిందే. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళుతున్నాడు. ఈ క్రమంలొనే తాజాగా నటిస్తున్న సినిమా లాఠి. ఎ.వినోద్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ పతాకంపై రమణ, నంద కలిసి సంయుక్తగా నిర్మిస్తున్నారు. సునయన ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో విశాల్ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తుండగా..చిత్రబృందం తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలింది. ఈ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. కాగా, పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బరాయన్ ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. 

Updated Date - 2022-04-07T13:29:01+05:30 IST