నడిగర్ యుద్ధంలో సత్యమే గెలిచింది: వేడుకల్లో విశాల్
ABN , First Publish Date - 2022-03-21T21:10:20+05:30 IST
నడిగర్ సంఘం కొత్త భవనం నిర్మాణం అజెండాతో బరిలో దిగిన ‘పాండవర్ అని’ టీమ్ నడిగర్ సంఘం ఎన్నికల్లో గెలుపొందింది. 2019లో జూన్‌లో జరిగిన ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు ఆదివారం విడుదలయ్యాయి. నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ జనరల్ సెక్రటరీగా గెలుపొందారు. వీరికి ఎదురుగా భాగ్యరాజ్, శంకర్ దాస్ ప్యానల్ పోటీ చేసింది. ఓటింగ్ విషయంలో విశాల్ అక్రమాలకు పాల్పడ్డారని ఎదుటి ప్యానల్ కోర్టును ఆశ్రయించింది.

నడిగర్ సంఘం కొత్త భవనం నిర్మాణం అజెండాతో బరిలో దిగిన ‘పాండవర్ అని’ టీమ్ నడిగర్ సంఘం ఎన్నికల్లో గెలుపొందింది. 2019లో జూన్‌లో జరిగిన ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు ఆదివారం విడుదలయ్యాయి. నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ జనరల్ సెక్రటరీగా గెలుపొందారు. వీరికి ఎదురుగా భాగ్యరాజ్, శంకర్ దాస్ ప్యానల్ పోటీ చేసింది. ఓటింగ్ విషయంలో విశాల్ అక్రమాలకు పాల్పడ్డారని ఎదుటి ప్యానల్ కోర్టును ఆశ్రయించింది. దానితో ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదంటూ ఫలితాలు వెల్లడించాలని మద్రాసు కోర్టు తీర్పు ఇచ్చింది. ఆదివారం విశ్రాంత జడ్జి పద్మనాభన్ సమక్షంలో ఓట్ల లెక్కింపు జరిగింది. 1701 ఓట్లతో ‘పాండవర్ అని’ బృందం విజయం సాధించారు. తమ ప్యానల్ విజయం సాధించడంతో నాజర్, విశాల్, కార్తి ఆనందం వ్యక్తం చేశారు. షూటింగ్ స్పాట్‌లో విశాల్ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. దక్షిణ భారత నటీనటుల సంఘం సభ్యులు అందరికీ విశాల్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘‘నిజాయతీ, పడిన కష్టం ఎప్పుడూ ఫెయిల్ కాదని చరిత్ర చెబుతోంది. నడిగర్ సంఘం ఎన్నికల్లో అది మరోసారి రుజువైంది. ఇదొక యుద్ధంలా జరిగింది. ఈ యుద్ధంలో చివరికి సత్యమేగెలిచింది. నేను న్యాయవ్యవస్థను నమ్ముతాను. ఎన్నికలను నిజయతీగా నిర్వహించి ప్రశాంతంగా లెక్కించిన విశ్రాంత జడ్జి పద్మనాభన్‌గారికి కృతజ్ఞతలు . ‘పాండవర్ అని’ టీమ్‌కు అభినందనలు. త్వరలోనే మా డ్రీమ్ ప్రాజెక్ట్ నడిగర్ సంఘం భవంతి నిర్మాణ పనులు చేపడతాం’’ అని విశాల్ పేర్కొన్నారు.