సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Mark Antony First Look: మొదటిసారి మాస్ లుక్‌లో విశాల్.. కొత్త స్టార్ ట్యాగ్‌తో భయపెడుతూ..

ABN, First Publish Date - 2022-08-29T19:06:26+05:30

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారి మోగిపోతున్న పదం పాన్ ఇండియా(Pan India). చిన్న హీరో నుంచి స్టార్ హీరో వరకూ అందరి దృష్టి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారి మోగిపోతున్న పదం పాన్ ఇండియా(Pan India). చిన్న హీరో నుంచి స్టార్ హీరో వరకూ అందరి దృష్టి అలాంటి సినిమా చేయడంపైనే. బాహుబలి సినిమాతో రాజమౌళి మొదలు పెట్టిన సినీ విప్లవం భాగమైయ్యేందుకు ప్రతి హీరో ప్రయత్నిస్తున్నాడు. అందులో కోలీవుడ్ స్టార్ విశాల్(Vishaal) కూడా ఒకరు. దానిలో భాగంగా అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘మార్క్ ఆంటోనీ(Mark Antony)’.


గతేడాది ఈ భారీ బడ్జెట్ సినిమాని ప్రకటించినప్పటి నుంచే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే.. అప్పటి నుంచి ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో తమిళంతోపాటు తెలుగులో ఉన్న ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో విశాల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు (ఆగస్టు 29న) ఆ మూవీలోని విశాల్ ఫస్ట్ లుక్‌ని  విడుదల చేశారు. అందులో.. విశాల్ లుంగీలో గడ్డంతోపాటు నుదుటి మీద తిలకం, చేతిలో గన్‌తో ఊర మాస్‌గా లుక్‌లో ఉన్నారు. అంతేకాకుండా ఈ ‘హ్యాపీ బర్త్ డే పురాచ్చి దళపతి’ అని శుభాకాంక్షలు చెబుతూ కొత్త స్టార్ ట్యాగ్ ‌కూడా ఇచ్చారు. అంటే.. ‘విప్లవ కమాండర్’ అని తెలుగులో ఆ స్టార్ ట్యాగ్‌కి అర్థం. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొట్టమొదటిసారి విశాల్ ఇలాంటి మాస్ లుక్‌లో చూసిన ఆయన అభిమానులు ఫిదా అయ్యి ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ఈ మూవీలో విశాల్‌కి జోడీగా రీతూ వర్మ(Ritu Varma) నటిస్తుండగా.. ఎస్‌జే సూర్య ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.



Updated Date - 2022-08-29T19:06:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!