ఓటీటీలో విక్రమ్‌ ప్రభు ‘టానాక్కారన్’

ABN , First Publish Date - 2022-03-17T19:01:23+05:30 IST

కోలీవుడ్ యంగ్ డైనమైట్ విక్రమ్ ప్రభు... గతేడాది ఓటీటీలో విడుదలైన ‘పులికుత్తి పాండి’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించాడు. సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతకు ముందు సంవత్సరం విడుదలైన ‘అసురగురు’ చిత్రం కూడా సూపర్ హిట్టైంది. ఇక ఈ ఏడాది విడుదల కానున్న ఇతడి తాజా చిత్రం ‘టానాక్కారన్’. ఇందులో విక్రమ్ ప్రభు పోలీస్ గా నటిస్తున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టరుగా పనిచేసిన తమిళ్‌ దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందింది ఈ సినిమా. అంజలీ నాయర్‌ కథానాయికగా నటించారు. ఇతర పాత్రల్లో లాల్‌, ఎంఎస్.భాస్కర్‌ తదితరులు నటించారు.

పోలీస్‌ శిక్షణలో ఎదురయ్యే కష్టనష్టాలను, సమస్యలను ఈ చిత్రంలో చూపించనున్నారు. ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మించిన ఈ సినిమాకు జిబ్రాన్‌ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే ఈ చిత్రం టీజర్‌ విడుదలవగా, అభిమానుల్లో మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ నెలలో డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల చేయనున్నట్టు చిత్రం బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే, విడుదల తేదీని వెల్లడించాల్సి ఉంది. 

Updated Date - 2022-03-17T19:01:23+05:30 IST

Read more