సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vikram Movie కి సెన్సేషనల్ కలెక్షన్లు.. కేవలం అయిదు రోజుల్లోనే ఎన్ని కోట్లు వచ్చాయంటే..

ABN, First Publish Date - 2022-06-08T20:48:59+05:30

విభిన్నమైన పాత్రలు పోషిస్తూ విలక్షణ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు కమల్ హాసన్ (Kamal Haasan). ఆయన తాజాగా నటించిన సినిమా ‘విక్రమ్’ (Vikram). విజయ్ సేతుపతి (Vijay Sethupathi),

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విభిన్నమైన పాత్రలు పోషిస్తూ విలక్షణ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు కమల్ హాసన్ (Kamal Haasan). ఆయన తాజాగా నటించిన సినిమా ‘విక్రమ్’ (Vikram). విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) కీలక పాత్రలు పోషించారు. సూర్య అతిథి పాత్రలో మెరిశారు. లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించారు. పాన్ ఇండియాగా ఈ చిత్రం రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న పలు భాషల్లో ఈ మూవీ విడుదల అయింది. ఈ సినిమా విడుదలైన నాటి నుంచి విమర్శకుల ప్రశంసలతో పాటు అభిమానుల మన్ననలు దక్కించుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతుంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో రెండు మిలియన్ డాలర్స్‌ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది.  


‘విక్రమ్’ సినిమాకు ‘మేజర్’ (Major), ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ (Samrat Prithviraj) నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ కలెక్షన్స్‌ను కొల్లగొడుతూనే ఉంది.  ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 200కోట్ల వసూళ్లను  రాబట్టింది. కేరళలో ఆల్‌టైం నం-1 తమిళ సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో కమల్ హాసన్ దర్శకుడైన లోకేశ్‌కు లెక్సస్ కారును బాహుమతిగా అందజేశారు.‘విక్రమ్’ ను కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ఇంటర్నేషనల్ (Raaj Kamal Films International) తో కలసి ఆర్ మహేంద్రన్‌(R Mahendran) నిర్మించారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం రూ. 120కోట్లని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. ప్రచార కార్యక్రమాల కోసం రూ. 5కోట్లను కేటాయించారు. ఈ సినిమా విడుదలకు ముందే రూ. 200కోట్ల బిజినెస్ చేయడం విశేషం.

Updated Date - 2022-06-08T20:48:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!