Vijayanand: ‘యువతకి ప్యాషన్ ఉండాలని నేర్పుతుంది’

ABN , First Publish Date - 2022-12-01T16:12:22+05:30 IST

దేశంలో ఉపరితల కార్గో రవాణాలో అగ్రగామిగా ఉన్న ‘వీఆర్‌ఎల్‌’ (విజయానంద్‌ రోడ్‌ లైన్స్‌) అధిపతి, పారిశ్రామికవేత్త ‘పద్మశ్రీ’ విజయ్‌ సంకేశ్వరన్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘విజయానంద్‌’..

Vijayanand: ‘యువతకి ప్యాషన్ ఉండాలని నేర్పుతుంది’

దేశంలో ఉపరితల కార్గో రవాణాలో అగ్రగామిగా ఉన్న ‘వీఆర్‌ఎల్‌’ (విజయానంద్‌ రోడ్‌ లైన్స్‌) అధిపతి, పారిశ్రామికవేత్త ‘పద్మశ్రీ’ విజయ్‌ సంకేశ్వరన్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘విజయానంద్‌’ చిత్రం యువతరం కలలుగనే అవసరాన్ని నేర్పుతుందని ఆ చిత్ర దర్శకురాలు రిషికా శర్మ అన్నారు. తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ మూవీ ఈ నెల 9వ తేదీ భారీ స్థాయిలో రిలీజ్‌ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకురాలు రిషికా శర్మ, చిత్ర హీరో నిహాల్‌, హీరోయిన్‌ శ్రీలత ప్రహ్లాద్‌, నిర్మాత ఆనంద్‌ సంకేశ్వరన్‌ సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.


దర్శకురాలు రిషికా శర్మ మాట్లాడుతూ.. ‘స్వీయ చరిత్ర ఆధారంగా కన్నడంలో తెరకెక్కిన తొలి బయోపిక్‌ ఇదే. ఒక్క భాషలోనే నిర్మించాలని ప్లాన్‌ చేసి ఐదు భాషల్లో రూపొందించాం. ఒక గొప్ప వ్యక్తి జీవిత చరిత్రను దృశ్యకావ్యంగా తెరకెక్కించే బాధ్యత నాకు అప్పగించిన రియల్‌ హీరో విజయ్‌ సంకేశ్వరన్‌కు ధన్యవాదాలు. నేను దర్శకుడు మణిరత్నం వీరాభిమానిని. ఈ సినిమా చేయడానికి ఆయనే స్ఫూర్తి. నాలుగు తరాలకు చెందిన కటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధాలు, భావోద్వేగాలను చూపించాం’ అని చెప్పుకొచ్చారు.


హీరో నిహాల్‌ మాట్లాడుతూ.. సినిమా అనేది వ్యాపారం కాదు.. అది ఒక కళ. తమిళ చిత్రపరిశ్రమ యువత ప్రతిభను గుర్తించి అవకాశాలు కల్పిస్తుందన్నారు. నిర్మాత విజయ్‌ సంకేశ్వరన్‌ మాట్లాడుతూ.. ‘కథ వివరించిన తీరు నచ్చడంతో సొంత నిర్మాణ సంస్థ వీఆర్‌ఎల్‌ ప్రొడక్షన్స్‌ బ్యానరుపైనే నిర్మించాం. ప్రమోషన్‌కు వెళ్లిన ప్రతిచోట అద్భుతమైన స్పందన వస్తుంది’ అన్నారు.



Updated Date - 2022-12-01T16:12:22+05:30 IST