సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన Thalapathy Vijay, Rashmika ఫొటోలు.. ఎంతో సీక్రెట్‌గా ఉంచినా..

ABN, First Publish Date - 2022-06-13T20:54:49+05:30

కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు దళపతి విజయ్ (Thalapathy Vijay). ప్రస్తుతం వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్‌గా ‘దళపతి 66’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు దళపతి విజయ్ (Thalapathy Vijay). ప్రస్తుతం వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్‌గా ‘దళపతి 66’ అని పెట్టారు. తెలుగు, తమిళ భాషల్లో ‘దళపతి 66’ రూపొందుతోంది. రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా హైదరాబాద్‌లో జరుగుతుంది. తాజాగా ఈ మూవీ మేకర్స్‌కు షాక్ తగిలింది. అదేంటంటే..


‘దళపతి 66’ సినిమాకు సంబంధించిన ఫొటోలు లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాయి. ఫలితంగా దర్శకుడు వంశీ పైడిపల్లి అప్‌సెట్‌కు గురయ్యాడు. అందువల్ల సినిమాకు సంబంధించి మరిన్ని పిక్స్ లీక్ కాకుండా మొబైల్ ఫోన్‌లపై ఆంక్షలు విధించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, శ్యామ్, యోగిబాబు, ప్రభు, జయసుధ, శ్రీకాంత్, సంగీత కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీతోనే విజయ్ నేరుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. 





Updated Date - 2022-06-13T20:54:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!