ఆ రోజే Thalapathy 66 ఫస్ట్‌లుక్

ABN , First Publish Date - 2022-06-19T23:13:41+05:30 IST

కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు దళపతి విజయ్ (Thalapathy Vijay). ప్రస్తుతం వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘దళపతి 66’ (Thalapathy 66)

ఆ రోజే Thalapathy 66 ఫస్ట్‌లుక్

కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు దళపతి విజయ్ (Thalapathy Vijay). ప్రస్తుతం వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో నటిస్తున్నారు. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘దళపతి 66’ (Thalapathy 66) అని వర్కింగ్ టైటిల్‌ పెట్టారు. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఇప్పటి వరకు విడుదల చేయలేదు. విజయ్ అభిమానుల ఎదురు చూపులకు తెర దించుతూ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్‌ను తాజాగా మేకర్స్ ప్రకటించారు. 


‘దళపతి 66’ ఫస్ట్‌లుక్‌ను జూన్ 21న సాయంత్రం 6:01గంటలకు విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందినట్టు తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీతోనే విజయ్ నేరుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, శ్యామ్, యోగిబాబు, ప్రభు, జయసుధ, శ్రీకాంత్, సంగీత కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ మేకర్స్‌కు షాక్ తగిలింది. దళపతి 66 సెట్ నుంచి హీరో, హీరోయిన్ పిక్స్ లీక్ అయ్యాయి. దీంతో అధికారికంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు ‘వారసుడు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరి ఏ టైటిల్‌ను ఫైనలైజ్ చేస్తారో తెలియాలంటే నిర్మాతల నుంచి ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. Updated Date - 2022-06-19T23:13:41+05:30 IST

Read more