సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

శరవేగంగా Vijay Sethupathi మూవీ షూటింగ్..

ABN, First Publish Date - 2022-05-22T15:54:04+05:30

శరవేగంగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi ) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే విఘ్నేష్ శివన్ (Vignesh Sivan) దర్శకత్వంలో విజయ్ సేతుపతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శరవేగంగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే విఘ్నేష్ శివన్ (Vignesh Sivan) దర్శకత్వంలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi ) నయనతార (Nayanathara), సమంత (Samantha) ప్రధాన పాత్రల్లో నటించిన ట్రైయాంగిల్ లవ్ స్టోరి కాథువాకుల రెండు కాదల్ (Kaathuvaakula Rendu Kaadhal) సినిమా వచ్చి హిట్ సాధించింది. ఈ సినిమా తెలుగులోను కణ్మని రాంబో ఖతీజా (Kanmani Rambo Khatija)పేరుతో వచ్చి ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే విజయ్ తన నెక్స్ట్ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.


RS.ఇన్ఫోటైన్మెంట్‌ పతాకంపై నిర్మాత ఎల్రెడ్‌ కుమార్‌ నిర్మాణ సారథ్యంలో జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వెట్రిమారన్‌ (Vetrimaaran) తెరకెక్కిస్తున్న ‘విడుతలై’ (Viduthalai) చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుపుకొంటుంది. మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఇప్పటికే మూడు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుంది.  50 రోజుల పాటే సాగే నాలుగో షెడ్యూల్‌ దిండిగల్‌ సమీపంలోని సిరుమలైలో జోరుగా సాగుతోంది. ఇందులో విజయ్‌ సేతుపతికి సంబంధించిన సన్నివేశాలను 30 రోజులుగా చిత్రీకరిస్తున్నారు. మరో నటుడు సూరి, ఇతర నటీనటులు పాల్గొనే సన్నివేశాలను జూన్‌ 10వ తేదీ వరకు పూర్తి చేయనున్నారు. 


ఇందుకోసం సిరుమలై అటవీ ప్రాంతంలోని కొండపై ఒక గ్రామీణ సెట్‌ను ఆర్ట్‌ డైరెక్టర్‌ జాకీ నిర్మించారు. ఇక్కడ ఈ చిత్రం బ్యాక్‌డ్రాప్‌ సన్నివేశాలను రియలిస్టిక్‌గా చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం దాదాపు 450 మంది యూనిట్‌ సభ్యులు అక్కడే 50 రోజులుగా బస చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో విషపూరిత సర్పాలు, అడవి కుక్కలు, జలగలు ఇతర విష పురుగుల మధ్య ఉంటూ షూటింగ్‌ చేస్తున్నారు. ఈ బృందంతో పాటు 24 గంటల పాటు అంబులెన్స్‌, వైద్యుడు, సహాయ సిబ్బంది కూడా ఉంటోంది. మూవీకి ఇసైఙ్ఞాని ఇళయరాజా సంగీతం సమకూర్చుతున్నారు. 

Updated Date - 2022-05-22T15:54:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!