విజయ్ ఆంటోనీ ‘రత్తం’ చిత్రం డబ్బింగ్ ప్రారంభం
ABN, First Publish Date - 2022-04-24T19:54:58+05:30
ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానరులో సీ.ఎస్ అముదన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రక్తం’. ఈ సినిమా డబ్బింగ్ పనులు పూజా కార్యక్రమంతో శనివారం ప్రారంభమయ్యాయి. ఇప్పటికే స్వదేశంలో షూటింగ్ పూర్తి చేసుకోగా, మరికొంత భాగాన్ని విదేశాల్లో షూట్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో త్వరలోనే విదేశాలకు వెళ్ళనుంది చిత్ర బృందం.
ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానరులో సీ.ఎస్ అముదన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రత్తం’. ఈ సినిమా డబ్బింగ్ పనులు పూజా కార్యక్రమంతో శనివారం ప్రారంభమయ్యాయి. ఇప్పటికే స్వదేశంలో షూటింగ్ పూర్తి చేసుకోగా, మరికొంత భాగాన్ని విదేశాల్లో షూట్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో త్వరలోనే విదేశాలకు వెళ్ళనుంది చిత్ర బృందం. ఇందులో విజయ్ ఆంటోనీతో పాటు మహిమా నంబియార్, నందితా శ్వేత, రమ్యా నంబీశన్ హీరోయిన్లుగా, నిళల్‌గల్ రవి, జాన్ మహేంద్రన్, కలైరాణి, మహేష్ తదితరులు ఇతర పాత్రలను పోషించారు. గోపి అమర్నాథ్ చాయాగ్రహణం అందించగా, కన్నన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు.