Kochu Premam: ప్రముఖ మలయాళీ నటుడి మృతి

ABN , First Publish Date - 2022-12-04T23:41:15+05:30 IST

థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ఆరంభించి సినిమా‌ల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు కొచ్చు ప్రేమమ్ (Kochu Premam). ‘తిలక్కం’, ‘కల్యాణరామన్’ వంటి చిత్రాల్లో నటించి ఫేమ్‌ను సంపాదించుకున్నారు.

Kochu Premam: ప్రముఖ మలయాళీ నటుడి మృతి

థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ఆరంభించి సినిమా‌ల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు కొచ్చు ప్రేమమ్ (Kochu Premam). ‘తిలక్కం’, ‘కల్యాణరామన్’ వంటి చిత్రాల్లో నటించి ఫేమ్‌ను సంపాదించుకున్నారు. ఆయన చాలా కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వైద్యులు చికిత్స అందించినప్పటికి ఆయన మరణించారు. తిరువనంతపురంలో డిసెంబర్ 3న మృతి చెందారు. కొచ్చు ప్రేమమ్ మృతితో మలయాళం ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. సెలబ్రిటీలందరు విచారం వ్యక్తం చేస్తున్నారు. కొచ్చు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.      


మలయాళీ నటుడు కొచ్చు ప్రేమమ్ 1955లో జన్మించారు. పెయాడ్‌లోని ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. అనంతరం నాటక రంగంలోకి ప్రవేశించారు. నాటకాల్లో పేరు, ప్రఖ్యాతలు రావడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘ఎంజు నిరంగల్’ (Ezhu Nirangal) చిత్రంతో వెండి తెర పైకి రంగప్రవేశం చేశారు. కామిక్ రోల్స్‌తో ఇండస్ట్రీలో ఫేమ్ సంపాదించుకున్నారు. పలు టీవీ షోల్లో కూడా నటించారు. ‘సినీ మాలా’, ‘కాలివీడు’, ‘మిస్టర్ హిట్లర్’, ‘స్వామి అయ్యప్పన్’ వంటి సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించారు. కొచ్చు తాజాగా పృథ్వీరాజ్ ‘కడువా’, మోహన్ లాల్ ‘ఆరట్టు’ లో కనిపించారు. ఆయనకు ఓ కుమారుడు హరికృష్ణన్ ఉన్నారు.

Updated Date - 2022-12-04T23:41:15+05:30 IST

Read more